Jawan Missing: పంజాబ్ సరిహద్దులో సైనికుడిగా పనిచేస్తున్న సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లికి చెందిన బోకూరి సాయికిరణ్‌రెడ్డి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆరు నెలల క్రితమే ఆయన సైన్యంలో చేరారు. మూడు వారాల క్రితం సెలవుపై వచ్చి.. ఈ నెల 5న పంజాబ్‌కు బయలుదేరివెళ్లారు.
Jawan Missing: జవాన్ మిస్సింగ్.. వారం నుంచి తెలియని ఆచూకీ - జవాన్ అదృశ్యం
Jawan Missing: ఆరు నెలల క్రితం సైన్యంలో చేరిన ఓ జవాన్ సెలవులపై ఇంటికి వచ్చాడు. అందరితో సంతోషంగా గడిపాడు. మళ్లీ విధుల కోసం ఇంటి నుంచి వెళ్లిన అతను విధుల్లో చేరలేదు. అలా అని ఇంటికి రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
కుటుంబ సభ్యులతో చివరిసారిగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫోన్‌లో మాట్లాడారు. ఆ తరవాతి నుంచి చరవాణి స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యుల్లో కలవరం మొదలైంది. వారం రోజులుగా ఆయన ఆచూకీ తెలుసుకోవడానికి వారు యత్నించి విఫలమయ్యారు. పంజాబ్‌లోని సైనిక అధికారులకు ఫోన్ చేస్తే.. విధుల్లో చేరలేదని చెప్పారని తల్లిదండ్రులు విజయ, పటేల్‌రెడ్డి వాపోతున్నారు. చేర్యాల పోలీస్ స్టేషన్‌లో సాయికిరణ్‌రెడ్డి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ‘జీరో ఎఫ్‌ఐఆర్’ నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి తెలిపారు. దిల్లీ విమానాశ్రయ పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడ కేసు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ప్రముఖ గాయని కుటుంబం అదృశ్యం.. రైల్వే ట్రాక్‌పై తండ్రి మృతదేహం!