తెలంగాణ

telangana

ETV Bharat / crime

Hyderabad Drugs Case: పంజాగుట్ట డ్రగ్స్​ కేసులో బడా వ్యాపారులు - Hyderabad Drugs Case remand report

Hyderabad Drugs Case: పంజాగుట్ట డ్రగ్స్​ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్​కు చెందిన బడా వ్యాపారులు.. ప్రధాన నిందితుడు టోనీ వద్ద డ్రగ్స్​ కొనుగోలుచేసినట్లు గుర్తించామని పోలీసులు రిమాండ్​ రిపోర్టులో పేర్కొన్నారు. వీరందరినీ కస్టడీలోకి తీసుకొనేందుకు కోర్టులో పిటిషన్​ వేసినట్లు చెప్పారు.

Hyderabad Drugs Case
Hyderabad Drugs Case

By

Published : Jan 27, 2022, 6:17 PM IST

Hyderabad Drugs Case: హైదరాబాద్​ పంజాగుట్ట మాదక ద్రవ్యాల కేసులో మరో 10 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వీరిలో నలుగురు వ్యాపారులుండగా.. మరో ఆరుగురు వ్యక్తులు.. ప్రధాన నిందితుడు టోనీకి ఏజెంట్లుగా పనిచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించిన వాళ్లలో ఏడుగురు బడా వ్యాపారవేత్తలున్నారు. మరో నలుగురు వ్యాపారులు కూడా టోనీ దగ్గర మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసి, విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శశికాంత్, గజేంద్ర ప్రకాశ్, సంజయ్, అలోక్ జైన్ అనే వ్యాపారులు గత కొన్నినెలలుగా టోనీ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఎవరి టోనీ..

నైజీరియాకు చెందిన టోనీ 2006లో వివాహం చేసుకున్నాడు. అనంతరం భార్యతో మనస్పర్ధలు తలెత్తి వేరుగా ఉంటున్నాడు. కుమార్తెను తన తల్లి వద్ద ఉంచి.. 2013లో పర్యటక వీసాపై భారత్​కు వచ్చాడు. వస్త్రాలు, విగ్గులను నైజీరియాకు ఎగుమతి చేసేవాడు. డబ్బులు సరిపోకపోవడం వల్ల తోటి నైజీరియన్లు కొంత మంది డ్రగ్స్ విక్రయిస్తున్న విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి టోనీ సైతం అదే బాట పడ్డాడు. నైజీరియాకు చెందిన స్టార్​బాయ్.. ఓడ రేవుల మీదుగా ముంబయికి మాదక ద్రవ్యాలు చేరవేసేవాడు. 2019లో అతనితో పరిచయం పెంచుకున్న టోనీ.. అప్పటి నుంచి అతని వద్ద తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలుచేసి.. అవసరమైన వాళ్లకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. దీనికోసం ముంబయిలో 8 మంది ఏజెంట్లను నియమించుకున్నాడు. వాళ్ల సాయంతో మాదక ద్రవ్యాలను వినియోగదారుల వద్దకు చేరుస్తున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

వ్యాపారుల విచారణ కోసం పిటిషన్

డగ్ర్​ విక్రయించగా వచ్చే డబ్బును వెస్టర్న్​ మనీ యూనియన్​ ట్రాన్స్​ఫర్​ ద్వారా తన అనుచరుల ఖాతాలో జమచేయించుకొనే వాడు. డ్రగ్స్​ క్రయ, విక్రయాల సమయాల్లో వినియోగదారులతో మాట్లాడేందుకు కేవలం వాట్సాప్​ కాల్స్​ను మాత్రమే చేసేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈనెల 20న టోనీని పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. టోనీ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్​లో 11 మంది బడా వ్యాపారులు, మరో ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్లు గుర్తించారు. టోనీతో పాటు వ్యాపారులను కస్టడీలోకి తీసుకొనేందుకు కోర్టు అనుమతి కోసం పోలీసులు పిటిషన్​ దాఖలు చేశారు.

ఇదీచూడండి:

ABOUT THE AUTHOR

...view details