నిజామాబాద్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అభంశుభం తెలియని చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. ఈ కేసులో నిందితుడు దివ్యాంగుడు కావడం గమనార్హం. నిజామాబాద్ ఏసీపీ ఆరె వెంకటేశ్వర్ పూర్తి వివరాలను వెల్లడించారు.
ఓ కాలనీలో కూలీ పనులు చేసుకుని బతికే కుటుంబాలు నివసిస్తున్నాయి. పిల్లలను ఇంట్లో వదిలి పెద్దలు పనులకు వెళ్తుంటారు. ఆదివారం కాలనీలో ఆడుకుంటున్న చిన్నారులపై (8, 12 ఏళ్లు) స్థానికుడైన వసీం (33) కన్నేశాడు. వారికి చాక్లెట్ల ఆశ చూపించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడి జరిపాడు. బుధవారం ఓ బాలికకు నొప్పి రావడంతో కుటుంబీకులకు తెలియజేయగా విషయం బయటపడింది. వారు పోలీసులకు గురువారం నాడు ఫిర్యాదు చేశారు.