ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమూరు సమీపంలోని జాతీయ రహదారి పక్కన బ్యాగ్‌లో మృతదేహం సగ భాగాన్ని కుక్కి పడేసిన ఘటన కలకలం రేపింది. బ్యాగ్‌లో శవం ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పొట్ట నుంచి దిగువ భాగం వరకు ఉన్న శరీర భాగాలను బ్యాగ్‌లో పెట్టి పడేసినట్లు గుర్తించారు. మృతదేహం ఎవరిదన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎక్కడో చంపి ఇక్కడకు తీసుకొచ్చి పడేసినట్లుగా అనుమానిస్తున్నారు.
దారుణం: బ్యాగులో కుక్కిపెట్టిన సగం మృతదేహం - కుప్పం నేర వార్తలు
మృతదేహం సగం భాగాన్ని ఓ బ్యాగులో కుక్కిపడేసిన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమూరు సమీపంలో జరిగింది. పొట్ట నుంచి దిగువ భాగం వరకు ఉన్న శరీర భాగాలు మాత్రమే అందులో ఉంది. తలభాగం కనిపించలేదు. ఆ మృతదేహం ఎవరిదో అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దారుణం: బ్యాగులో కుక్కిపెట్టిన సగం మృతదేహం