తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం.. ఒకరు అరెస్ట్

ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతోన్న ఓ వ్యక్తిని టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయంలో నీటిపారుదల శాఖలో పర్యవేక్షకుడిగా పనిచేస్తున్నట్లు పలువురిని నమ్మించి.. లక్షల్లో డబ్బులు వసూలు చేశాడని పోలీసులు తెలిపారు.

hyderabad news, telangana news
hyderabad news, telangana news

By

Published : May 8, 2021, 8:02 PM IST

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ములుగు మండలం ఘన్​పూర్​కు చెందిన గుర్రం రాజేంద్ర హన్మకొండలో డిగ్రీ పూర్తి చేశాడు. 2014 నుంచి ఏడాది పాటు రేషన్ డీలర్​గా పనిచేసి.. పెద్దగా లాభాలు లేకపోవడం వల్ల వదిలిపెట్టి వ్యవసాయం చేశాడు.

వ్యసనాల బారిన పడిన రాజేంద్ర... అడ్డదారిలో సంపాందించేందుకు అలవాటుపడ్డాడు. సచివాలయంలో నీటిపారుదల శాఖలో పర్యవేక్షకుడిగా పనిచేస్తున్నట్లు పలువురిని నమ్మించాడు. క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు.

ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడం వల్ల మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేంద్రపై పరకాల, బేగంపేట్, ఉప్పల్, ఎస్సార్ నగర్, వనపర్తిలో కేసులు నమోదయ్యాయి. రాజేంద్రను అరెస్ట్ చేసిన టాస్క్​ఫోర్స్ పోలీసులు ఎస్సార్ నగర్ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి:ప్రాణవాయువు కోసం ఒడిశా రాష్ట్రానికి ఆక్సిజన్​ ట్యాంకర్లు

ABOUT THE AUTHOR

...view details