రైలులో చెలరేగిన మంటలు.. పెద్దపెల్లి, రాఘవపూర్ మధ్య ప్రమాదం - fire accident today
19:48 October 09
రైలులో చెలరేగిన మంటలు.. పెద్దపెల్లి, రాఘవపూర్ మధ్య ప్రమాదం
దిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. శనివారం చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్‌ప్రెస్.. పెద్దపెల్లి జిల్లాలోని రాఘవపూర్- పెద్దపల్లి రైల్వే స్టేషన్ల మధ్యకు రాగానే.. రైలు కింద భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
వెంటనే అప్రమత్తమైన రామగుండం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది.. ఫైర్ ఫైటర్స్‌తో మంటలను ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. త్వరితగతిన అప్రమత్తమై మంటల్లో ఆర్పి వేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని ప్రయాణికులు అభినందించారు.
ఇదీ చూడండి: