తెలంగాణ

telangana

ETV Bharat / crime

సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లే టార్గెట్​.. సినిమాల పేరిట రూ.కోట్లలో టోకరా..

సినిమాల్లో పెట్టుబడుల పేరిట ఎక్కువ డబ్బు ఆశ చూపి.. బురిడీ కొట్టించారు. తీరా డబ్బులు ఇచ్చాక తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. సినీ పరిశ్రమకు మచ్చతెచ్చేలా ఉన్న ఈ ఘరానా మోసం తాజాగా బయటపడింది. ఇంతకీ ఈ ఘరానా మోసం ఎక్కడ, ఎలా జరిగిందంటారా..?

Film industry big fraud
ఫిల్మ్‌ ఇండస్ట్రీ మోసం

By

Published : Oct 14, 2022, 6:35 PM IST

Updated : Oct 14, 2022, 10:15 PM IST

మోసపోయిన బాధితులు

ఫిల్మ్ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్ పేరుతో పలు సినిమాల్లో పెట్టుబడుల పేరుతో రూ.6 కోట్ల మోసానికి పాల్పడ్డ నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వారి బంధువులనే టార్గెట్ చేసిన ఈ ముఠా.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లను చెప్పి మోసాలకు పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ సీసీఎస్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్‌లు మోసాలకు పాల్పడ్డారని బాధితులు తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్, బోర్‌వెల్స్‌ వంటి పలు రంగాల్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం చేశారన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌, అల వైకుంఠపురం, లవ్‌స్టోరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది సినిమాలలో తమ డబ్బు పెట్టుబడులు పెడతామని నమ్మించారన్నారు. వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్చిన మొత్తంలో అధిక లాభాలు ఇస్తామన్నారని పేర్కొన్నారు.

సుమారు 30 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌లు, వారి బంధువుల నుంచి రూ.6 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశారన్నారు. డబ్బులు తిరిగి అడగడంతో బెదిరింపులకు పాల్పడి దాడులకు దిగారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి.. వారి అనుచరులతో బెదిరించారని ఆరోపించారు. మోసాలకు పాల్పడ్డ కొంగర అంజమ్మ చౌదరి, ఆమె కూతురు హేమ, కొడుకు కొంగర సుమంత్, నాగం ఉమా శంకర్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకొని.. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారులైన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్‌లను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బాధితులు తెలిపారు.

మోసగాళ్లు

ఇవీ చదవండి:

Last Updated : Oct 14, 2022, 10:15 PM IST

ABOUT THE AUTHOR

...view details