వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారం స్టేజి వద్ద నకిలీ పోలీసు(Fake Police)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు 3 లక్షల50 వేల రూపాయల విలువగల బంగారు అభరణాలతో పాటు ఒక ద్విచక్ర వాహనం, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Fake Police: వరంగల్ రూరల్ జిల్లాలో నకిలీ పోలీసు అరెస్ట్.. - వరంగల్ రూరల్ జిల్లా నేర వార్తలు
పోలీస్(Fake Police) అని చెప్పి దోపిడీకి పాల్పడిన నిందితుడిని వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు 3లక్షల50 వేల రూపాయల విలువ గల అభరణాలతోపాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Fake Police: నకిలీ పోలీసు అరెస్ట్.. రూ. 3.50 లక్షలు స్వాధీనం
నల్గొండ జిల్లా, దామచర్ల మండలం, గణేష్ పహాడ్ గ్రామానికి చెందిన నిందితుడు బానోత్ వెంకటేశ్ ఓ వ్యక్తి వద్ద తను పోలీస్ అని బెదిరించి నగలు కాజేసి పరారయ్యాడు. సదరు వ్యక్తి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వారం గడవకముందే నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని పట్టుకున్న వర్గన్నపేట ఏసీపీ రమేష్, సీఐ విశ్వేశ్వర్, ఎస్సై వంశీకృష్ణను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అభినందించారు.
ఇదీ చదవండి:Etela Rajender: దిల్లీ బయల్దేరిన మాజీమంత్రి ఈటల రాజేందర్