తెలంగాణ

telangana

ETV Bharat / crime

Dating Doctor: డేటింగ్​ యాప్​ ద్వారా డాక్టర్ ఛీటింగ్ - aig doctor news

అతడు బాధ్యతయుతమైన వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. డేటింగ్ యాప్​ ద్వారా ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ క్లోజ్ అయ్యారు. సదురు యువతి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా దాటవేసేవాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సదురు ప్రబుద్ధుడికి ఇదివరకే వివాహం అయింది. విషయం తెలుసుకున్న యువతి... పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Doctor
డేటింగ్

By

Published : Jul 14, 2021, 8:16 PM IST

తనకు వివాహం అయిన విషయం దాచిపెట్టి ఓ యువతిని పెళ్లాడుతానంటూ మాయామాటలు చెప్పి మోసానికి యత్నించిన ఓ వైద్యుడిని కేపీహెచ్​బీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఏపీ గుంటూరు జిల్లా బ్రాడిపేటకు చెందిన గబ్బిట అభిరాం చంద్ర... గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో న్యూరో సర్జన్​గా పని చేస్తున్నాడు.

నిజాంపేట రోడ్​లో నివసించే ఓ యువతి... ఫిట్​నెస్ ట్రైనర్​గా పనిచేస్తోంది. సెప్టెంబర్ 2020లో ఆ యువతి బంబుల్ అనే డేటింగ్ యాప్​ (Dating App)లో తన వివరాలు అప్​లోడ్ చేసింది. తరువాత రోజే అభిరాం చంద్ర ఆ యాప్ ద్వారా ఆ యువతికి పరిచయమయ్యాడు. తనకు వివాహాం అయిన విషయాన్ని దాచిపెట్టి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.

ఛీటింగ్ డాక్టర్ అభిరాం

యువతితో పరిచయం పెంచుకున్న అతడు... ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. వివాహం చేసుకుందామన్న ప్రతీసారి... ప్రతిపాదనను దాటి వేసేవాడు. అభిరాం గురించి వివరాలు సేకరించిన ఆ యువతికి, అభిరాం చంద్రకు ముందే వివాహం జరిగింది అనే విషయం తెలిసింది. తనను అభిరాం చంద్ర మోసగించేందుకు యత్నించాడని గుర్తించిన బాధితురాలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. డేటింగ్ యాప్​లు వాడి ముక్కుముఖం తెలియని వాళ్లతో పరిచయాలు పెంచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: Green Channel: గ్రేట్ పోలీస్... గ్రీన్​ఛానల్ సక్సెస్

ABOUT THE AUTHOR

...view details