Recording Dance at Birthday Celebrations: హైదరాబాద్ పాతబస్తీలోని రెయిన్ బజార్లో ఇటీవల జరిగిన పుట్టిన రోజు వేడుకలు చర్చనీయాంశంగా మారాయి. బర్త్డే వేడుకల పేరిట ఓ ఇంట్లో జరిగిన సంబరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో అతిథులను సంతోషపెట్టడానికి పలువురు యువతులకు డబ్బులిచ్చి నృత్యాలు చేయించారు. పార్టీకి వచ్చిన వారు సైతం.. ఆ యువతులతో కలిసి చిందులేశారు. ఆ దృశ్యాలన్నిటినీ చరవాణుల్లో బంధించారు.
కాగా ఈ దృశ్యాలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు ఈ పార్టీ ఎప్పుడు జరిగింది.? ఎవరు ఏర్పాటు చేశారు.? ఏ సమయం వరకు జరిగాయనే తదితర విషయాలు తెలియాల్సి ఉంది. జనావాసాల్లో ఇంత జరుగుతున్నా ఇప్పటివరకూ పోలీసులకు ఫిర్యాదు అందకపోవడం గమనార్హం.
ఇవీ చదవండి: