తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cyber Fraud: కిడ్నీలు అమ్మి అప్పులు కట్టాలనుకుంటే.. వాళ్లనూ దోచేశారు! - cyber crime in hyderabad

అప్పులు తీర్చాలన్న ఆత్మాభిమానంతో కిడ్నీలు కూడా అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు ఆ దంపతులు. అమ్ముకునేందుకు ఆన్​లైన్​లో వెతకటమే వాళ్లు చేసిన తప్పైంది. ఆ భార్యాభర్తల ఆత్మాభిమానాన్ని అవకాశంగా తీసుకున్న సైబర్​ నేరగాళ్లు... కొంచెం కూడా కనికరం లేకుండా దొరికినకాడికి దోచుకున్నారు.

cyber frauds robbed 40 lakhs from couple who wanted to sell kidneys to pay the debt
cyber frauds robbed 40 lakhs from couple who wanted to sell kidneys to pay the debt

By

Published : Jul 14, 2021, 7:44 AM IST

అప్పులు తీర్చేందుకు మూత్రపిండాలు అమ్ముకోవడం తప్ప వేరే మార్గం లేదని భావించిన వారిని సైబర్​ నేరగాళ్లు నిండా ముంచారు. కిడ్నీలు కొనేవారి కోసం ఆన్‌లైన్‌లో అన్వేషించిన దంపతులకు సైబర్‌ మోసగాళ్లు మాయమాటలు చెప్పి రూ.40.38 లక్షల వరకు కాజేశారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉండే మోది వెంకటేశ్‌, లావణ్య దంపతులు స్థానికంగా స్టేషనరీ, బ్యాంగిల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం సొంతింటి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఇందుకు ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ద్వారా తొలుత రూ.34 లక్షలు, తర్వాత మరో రూ.10 లక్షలు రుణం తీసుకున్నారు. నాలుగంతస్తుల ఇల్లు సిద్ధమయ్యేసరికి రూ.1.50 కోట్ల అప్పులయ్యాయి. కరోనా లాక్‌డౌన్‌తో వ్యాపారం దాదాపు మూతపడింది. మరోవైపు అప్పులిచ్చినవారి నుంచి ఒత్తిడి పెరిగింది. తమకు అప్పులిచ్చిన వారికి ఎలాగైనా తిరిగివ్వాలని భార్యాభర్తలిద్దరూ ఆత్మాభిమానంతో మూత్రపిండాలు అమ్ముకోవడానికి నిర్ణయించుకున్నారు.

గూగుల్‌లో అన్వేషించి..

మూత్రపిండాలు కొనేవారి గురించి దంపతులు గూగుల్‌లో అన్వేషించారు. మొదట ఓ వ్యక్తి పరిచయమై.. కేవలం రిజిస్ట్రేషన్‌ ఫీజు కడితే చాలన్నాడు. ఆ తర్వాత కిడ్నీకి బీమా, కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ల కోసమంటూ మొత్తం రూ.10 లక్షల వరకు కట్టించుకున్నాడు. అతనికి మరిన్ని డబ్బులు ఇవ్వలేక మరో వ్యక్తిని సంప్రదించారు. అతనూ రూ.12 లక్షల వరకు కట్టించుకున్నాడు. ఇలా మొత్తం నలుగురిని ఆన్‌లైన్‌లో సంప్రదించారు. ఓ వ్యక్తి కేవలం రిజిస్ట్రేషన్‌ ఫీజు కడితే రావాల్సిన మొత్తంలో సగం ఖాతాలో వేస్తానని నమ్మించాడు. చెప్పినట్లే రెండు ఖాతాల్లో డబ్బులు జమైనట్లు కనిపించాయి. రెండు, మూడు రోజుల్లో ఆ డబ్బులు తీసుకోవచ్చని చెప్పాడు. కానీ, విత్‌డ్రా చేద్దామంటే రాలేదు. అతన్ని తిరిగి సంప్రదించగా.. ఆర్థికశాఖ, ఎయిర్‌ఫోర్స్‌ అథారిటీ, ఆదాయపు పన్ను శాఖ సర్టిఫికెట్లు అవసరమంటూ డబ్బులు కట్టించుకున్నాడని బాధిత దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

నోట్లు శుభ్రం చేయాలని...

మరో వ్యక్తి డబ్బులు తీసుకునేందుకు బెంగళూరుకు వస్తే.. తమ మనుషులు అడ్వాన్స్‌ చెల్లిస్తారని చెప్పాడు. అది నిజమేనని నమ్మి వారు అక్కడికి వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు హోటల్‌కు వచ్చి లాకర్‌ తెరిచి డబ్బులు చూపించారు. నోట్లు నలుపు రంగులో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించగా.. ఇదంతా ఆర్‌బీఐ డబ్బు అని, రసాయనాలతో శుభ్రం చేయాల్సి ఉంటుందని చెప్పారు. కొన్నింటిని శుభ్రం చేసి చూపించారు. వాటిని ఓ ప్యాకెట్‌లో కట్టి ఇచ్చి.. 48 గంటల వరకు తెరవకూడదన్నారు. ముంబయి నుంచి రసాయనాలు తెప్పించాలంటూ వారు డబ్బులు కట్టించుకున్నారని, ఇందుకు తెలిసినవారి దగ్గర బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు దంపతులు తెలిపారు. తీరా హైదరాబాద్‌కు వచ్చాక ప్యాకెట్‌ తెరిచిచూస్తే అవన్నీ దొంగ నోట్లని తెలిసిందని వారు వాపోయారు.

ఇదీ చూడండి: THEATERS OPEN: సినిమాహాళ్లను తెరవడంపై కొనసాగుతోన్న సందిగ్ధత

ABOUT THE AUTHOR

...view details