Cyber Fraud: ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల వినియోగం బాగా పెరిగింది. మోసాలకు పాల్పడే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా బ్యాంకు ఖాతాల కేవైసీ పేరిట పలువురు ఖాతాదారులను మోసం చేస్తున్న ఇద్దరు నేరగాళ్లను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.
రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన భగవాన్ సాహ్య శర్మ, సచిన్ సైనీ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి బ్యాంక్ ఖాతాదారులకు చరవాణుల్లో లింక్‌లు పంపి వాటిని క్లిక్ చేసి తమ బ్యాంకు ఖాతాల కేవైసీ అప్‌డేట్ చేసుకోమని చెబుతున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ పేరు, పాస్‌వర్డ్, వంటి వివరాలు లింక్‌ల ద్వారా సేకరించిన నేరగాళ్లు.. ఖాతాదారుల సొమ్ము కొల్లగొడుతున్నారని పోలీసులు తెలిపారు.