తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఏటీఎంలో నగదు జమ చేయమంటే.. దోచుకెళ్లారు!

ఏటీఎంలో నగదు డిపాజిట్​ పేరుతో రూ. కోటి లక్షలు తీసుకుని పరారైన ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. కంపెనీ యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్​ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను గుర్తించారు.

ccs police caught culprits who are escaped after stealing money in atm
ఏటీఎంలో నగదు జమ చేయమంటే.. దోచుకెళ్లారు!

By

Published : Mar 10, 2021, 1:08 PM IST

ఏటీఎంలో జమ చేయాల్సిన నగదు తీసుకుని పరారైన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. రెండ్రోజుల నుంచి ఉద్యోగానికి గైర్హాజరవ్వడం వల్ల అనుమానమొచ్చిన కంపెనీ యాజమాన్యం ఆరా తీయగా.. ఏటీఎంలో జన చేయాల్సిన రూ. కోటి ముప్పై లక్షలు తీసుకుని పరారైనట్లు తేలింది. వెంటనే వారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు సెల్​ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. సికింద్రాబాద్​కు చెందిన కృష్ణ, మహబూబాబాద్​కు చెందిన రాజేశ్ వ్యక్తులుగా గుర్తించారు. వీరిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితుల నుంచి రూ.16 లక్షలు నగదు సీజ్ చేశారు. గతంలో ఈ తరహా మోసంలోనే రాజేశ్ అనే వ్యక్తి జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details