Vellulla SRSP Car incident : జగిత్యాల జిల్లాలో ఎస్సారెస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరి మృతేదహాలను పోలీసులు వెలికితీశారు. కొన్ని గంటల పాటు గజఈతగాళ్లతో గాలించిన పోలీసులు.. కారుతోపాటు ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు.
Vellulla SRSP Car incident : ఎస్సారెస్పీ కాల్వలో పడిన కారు వెలికితీత.. - తెలంగాణ వార్తలు
11:05 January 05
ఎస్సారెస్పీ కాల్వలో పడిన కారు వెలికితీత
జగిత్యాల జిల్లా ఎస్సారెస్పీ కాల్వలో పడిన కారును... ఎట్టకేలకు వెలికితీశారు. అందులో ఉన్న ఇద్దరి మృతదేహాలు బయటకు తీసిన పోలీసులు... మృతులు పూదరి రేవంత్, గుండవేని ప్రసాద్‌గా గుర్తించారు. మెట్‌పల్లి నుంచి ఆత్మకూరు వెళ్తున్న కారు... వెల్లుల్ల శివారులో ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ కాల్వలో పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు... కారు కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. గజఈతగాళ్లను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు క్రేన్ సాయంతో... కారును బయటకు తీశారు.
ఇలా గుర్తించారు..!
వెల్లుల్ల శివారులోని ఎస్సారెస్పీ వంతెన వద్ద కాకతీయ కాల్వకు ఉన్న రెయిలింగ్ కూలిపోయింది. ఆ విషయం గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు... వెల్లుల్ల రోడ్డులో ఉన్న సీసీ కెమెరాలో అర్ధరాత్రి కారు వెళ్తున్నట్లు కనిపించింది. కానీ గ్రామం లోపల ఉన్న కెమెరాలను పరిశీలించగా అక్కడ కారు వచ్చినట్లుగా సీసీ కెమెరాల్లో నిక్షిప్తంకాలేదు. కారు కాల్వలో పడినట్లు భావించారు. ఇదే సమయంలో మెట్‌పల్లికి చెందిన పూదరి రేవంత్, గుండవేని ప్రసాద్... మంగళవారం అర్ధరాత్రి నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు ఆధారంగా... అనుమానిత ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా కారు కాల్వలో పడినట్లు సమాచారం రావడంతో అనుమానించారు.
అనుమానంతో వెలికితీత
కాల్వలో కారుపడ్డట్లుగా తెలియడంతో వెల్లుల్ల వాసులతో పాటు ఆ మార్గంలో ప్రయాణించే వారు పెద్దసంఖ్యలో కాల్వ వద్దకు తరలివచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రెయిలింగ్‌ను ఢీకొట్టి కారు కాల్వలో పడినట్లు అనుమానించారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు... శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాలువకు నీటి సరఫరా నిలిపివేశారు. మూడు గంటలపాటు శ్రమించిన గజఈతగాళ్లు, పోలీసులు... ఎట్టకేలకు ఇద్దరి మృతదేహాలు, కారును వెలికితీశారు.
ఇదీ చదవండి:Husband killed Wife: మద్యం మత్తులో భార్యను చంపేసి.. ఆపై..