నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో ట్రాక్టర్ బోల్తా పడి... వాహనం నడిపిన బాలుడు మృతి చెందాడు. మొరం తరలిస్తున్న ట్రాక్టర్‌ను బాలుడు నడుపుతుండగా... అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. భీంగల్ పట్టణంలో యథేచ్ఛగా మొరం అక్రమ రవాణా సాగుతోందని... రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. మైనర్లు, లైసెన్స్ లేనివారితో తక్కువ డబ్బులిచ్చి కొందరు పని చేయించుకుంటున్నారని ఆరోపించారు.
మొరం ట్రాక్టర్ బోల్తా... బాలుడు మృతి! - తెలంగాణ వార్తలు
నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో బాలుడు మొరం ట్రాక్టర్ నడుపుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మైనర్లు వాహనం నడిపి ప్రమాదాలకు గురవడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి!.
మొరం ట్రాక్టర్ బోల్తా... బాలుడు మృతి!
మైనర్లు వాహనం నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతూ... ఇతరులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానికులు వాపోయారు. లైసెన్స్‌లేని వారు, మైనర్లు వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలుడి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:'స్నేహితులే చంపేశారు.. మూడేళ్లైనా న్యాయం జరగలేదు..!'