చెరువులో నీళ్లు తాగి ఒకదాని తర్వాత ఒకటి తొమ్మిది గేదెలు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. రోజులాగే గేదేలను మేత కోసం అడవిలోకి తీసుకెళ్లి తిరిగివస్తుండగా ఊర చెరువులో నీటిని తాగుతూ ఒకదాని తర్వాత ఒకటి మరణించాయని పశువుల కాపరి తెలిపారు. వెంటనే పశువైద్యుడు సందీప్ రెడ్డి వచ్చి పరిశీలించారు.
చెరువులో నీళ్లు తాగుతూ 9 గేదెలు మృతి.. ఏం జరిగింది?
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో 9 గేదెలు ఒకేసారి మృతి చెందాయి. చెరువులో నీరు తాగుతూనే మృత్యువాత పడ్డాయి. ఒక్కో గేదె ధర రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుందని బాధితులు వాపోయారు.
గేదెలు మృతి, ఊర చెరువులో నీళ్లు తాగుతూ గేదెలు మృతి
జొన్నపంట మొలకలను తినడం వల్లే మృతి చెందినట్లు పశు వైద్యుడు ధ్రువీకరించారు. ఒక్కో గేదె రూ.45 వేల నుంచి 50 వేల వరకు ఉంటుందని బాధితులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.