తెలంగాణ

telangana

ETV Bharat / crime

suspected death: అత్తారింటికి వచ్చిన అల్లుడు.. అనుమానాస్పదస్థితిలో మృతి..! - నేర వార్తలు

suspected death: అత్తగారింటికి వచ్చిన అల్లుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కొండాపురంలో చోటు చేసుకుంది. మృతుడు ఆత్మకూరు మండలం కొరటికల్‌కు చెందిన చామకూర లక్ష్మీనారాయణగా పోలీసులు గుర్తించారు.

suspected death
యాదాద్రి భువనగిరి జిల్లా కొండాపురంలోన ఘటన

By

Published : May 30, 2022, 12:58 PM IST

suspected death: అత్తగారింటికి వచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపురంలో చోటు చేసుకుంది. మృతుడు ఆత్మకూరు మండలం కొరటికల్‌కు చెందిన చామకూర లక్ష్మీనారాయణగా పోలీసులు గుర్తించారు.

అసలేం ఏం జరిగిందంటే: ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన చామకూర లక్ష్మీనారాయణ (43)కు మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపురానికి చెందిన మంగమ్మతో 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కొడుకు, కూతురు సంతానం కాగా.. జీవనోపాధి కోసం గత 8 నెలల క్రితం హైదరాబాద్​కు వచ్చి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భార్యా భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవని మృతుని తల్లి రాములమ్మ పోలీసులకు వివరించారు. మంగమ్మ 15 రోజుల క్రితం కూతురును తీసుకొని పుట్టింటికి వచ్చిందని.. వారిని తీసుకెళ్లేందుకు వచ్చిన తన కొడుకును ఇంటికి రాగానే కొట్టి చంపారని మృతుని తల్లి రాములమ్మ ఆరోపించింది.

మద్యం మత్తులో గోడకు గుద్దుకొని..: మద్యానికి బానిసై తనతో తరచూ గొడవ పెట్టుకునే వాడని మృతుని భార్య మంగమ్మ తెలిపింది. వేధింపులు తట్టుకోలేకే 15 రోజుల క్రితం పుట్టింటికి వచ్చానని వివరించింది. నిన్న మధ్యాహ్నం మోత్కూర్​కు వచ్చిన తన భర్త మద్యం సేవించి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చాడని.. అర్ధరాత్రి సమయంలో ఇంటి బయటకు వెళ్లి ప్రహరి గోడకు గుద్దుకొని కింద పడిపోయాడని పేర్కొంది. తాము గమనించి వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వగా.. వైద్య సిబ్బంది చనిపోయాడని నిర్ధారించినట్లు పోలీసులకు వివరించింది. మృతుని తల్లి రాములమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి:Brain stroke: కాళ్లపారాణి ఆరకముందే.. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది

విద్యుత్తు అధికారులపై రైతు 'మిక్సీ' నిరసన.. ఆరు నెలలుగా ఆఫీసులోనే..!

ABOUT THE AUTHOR

...view details