హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రెహమత్నగర్ డివిజన్ రాజీవ్‌గాంధీ నగర్‌లోని ఓ భవనంలో లక్ష్మణ్ అనే వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన్ని రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండడంతో దుర్వాసన రావడాన్ని గమనించారు స్థానికులు.
డోర్‌కి తాళం..ఇంట్లో శవం.. హత్యా? ఆత్మహత్యా?
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇంట్లో మృతదేహం.. హత్యా? ఆత్మహత్యా?
తాళం పగులగొట్టి చూడగా ఉరివేసుకుని ఉన్న లక్ష్మణ్ మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్నపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితమే లక్ష్మణ్ చనిపోయినట్లు ప్రాథమిక నిర్థరణకు వచ్చారు పోలీసులు. అయితే ఇంటి బయట తాళం వేసింది ఎవరన్నది మిస్టరీగా మారింది.
ఇదీ చదవండి:వివాహిత మృతి.. బంధువుల ఫిర్యాదు
Last Updated : Apr 3, 2021, 7:08 PM IST