తెలంగాణ

telangana

ETV Bharat / crime

సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న 12.5 కేజీల వెండి స్వాధీనం

హైదరాబాద్​ నుంచి అక్రమంగా తరలిస్తున్న వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం తెలంగాణ-ఆంధ్రప్రదేశ్​ సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు వెండిని గుర్తించి సీజ్ చేశారు.

12.5 kilos sliver seized by police in ap telangana border checkings
సరైన పత్రాలు లేకుండా 12.5 కేజీల వెండి తరలింపు

By

Published : Apr 5, 2021, 12:15 PM IST

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్​ సరిహద్దుల్లో పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. కర్నూల్ మండలం పంచలింగాల చెక్​పోస్ట్​ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా... ఎటువంటి పత్రాలు లేని 12.5 కేజీల వెండిని గుర్తించారు.

రాజస్థాన్​కు చెందిన గన్​శ్యామ్​ హైదరాబాద్​ నుంచి కర్నూల్​ మీదుగా... సరైన పత్రాలు లేని వెండితో స్కూటీ మీద వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 12.5 కేజీల వెండిని సీజ్​ చేసి... గన్​శ్యామ్​ను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి:ఏటీఎం చోరీకి యత్నం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details