రాష్ట్రంలో రెండు నగరపాలక సంస్థలు, ఐదు పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో వార్డుల పునర్విభజనకు ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణకుగాను వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని పురపాలక శాఖ ఆదేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలను వెలువరిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కొత్త పురపాలక చట్టం మేరకు మార్గదర్శకాలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వార్డుల పునర్విభజన ముసాయిదా, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం అనంతరం వార్డుల తుది జాబితాను పూర్తి వివరాలతో కలెక్టర్లకు అందచేసి ఆమోదం పొందాలని తెలిపారు. తర్వాత పురపాలకశాఖ డైరెక్టర్‌కు వార్డుల వివరాలను అందజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట పురపాలక సంఘం పాలకవర్గాల గడువు మార్చి 14తో ముగుస్తుంది. సిద్దిపేట పాలకవర్గం గడువు ఏప్రిల్ 15తో ముగియనుంది. కొత్త పురపాలికలు కొత్తూరు, నకిరేకల్‌కు తొలిసారి ఎన్నికలు జరుగుతుండగా జడ్చర్ల ఎన్నికలు గతంలో వాయిదా పడ్డాయి.
వార్డుల పునర్విభజనకు ప్రభుత్వ మార్గదర్శకాలు
* నగరం లేదా పట్టణం ఉత్తరం దిక్కునుంచి ప్రారంభించి, తూర్పు, దక్షిణం, పశ్చిమం దిక్కుల మేరకు వార్డుల పునర్విభజన చేయాలి.