బ్రకోలీ సాగు చేస్తూ లాభాలు గడిస్తున్న రైతు Broccoli farming in Warangal: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మానుకొండలో బ్రకోలీ సాగు చేస్తూ ఓ యువకుడు లాభాలు గడిస్తున్నాడు. బీటెక్ పూర్తి చేసి కొన్నేళ్లు హైదరాబాద్‌లో ఉద్యోగం చేసిన శివాజీ గణేశ్... సొంతూరికి వెళ్లి వైవిధ్యమైన రీతిలో పంటలు సాగుచేస్తున్నాడు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు..
Broccoli farming: సంప్రదాయ పంటలు పండిస్తే మార్కెట్లో గిరాకీ ఉండదని గ్రహించి... బ్రకోలీ పంట పండిస్తున్నాడు. ఇందులో విటమిన్లు పోషకాలు పుష్కలంగా ఉంటాయని, వ్యాయామం చేసే వారు ఎక్కువగా ఇష్టపడతారని తెలుసుకున్నాడు. తనకున్న స్థలంలో ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా.. సేంద్రీయ విధానంలో బ్రకోలీతో పాటు చెర్రీ, టమాట సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నాడు. 9వేల పెట్టుబడితో 50వేల వరకు లాభం పొందినట్లు తెలిపాడు.
ఇదీ చదవండి:Revanth Reddy: 'రైతుల పంటలు కొనకుంటే కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తాం'