తెలంగాణ

telangana

ETV Bharat / city

65వ జాతీయ రహదారిపై పెరిగిన టోల్​ చార్జీలు

హైదరాబాద్​, విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై టోల్​ ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు జీఎమ్​​ఆర్​ సంస్థ తెలిపింది. నిబంధనల ప్రకారమే రుసుం పెంచామని నిర్వాహకులు చెప్పారు.

టోల్​ గేటు

By

Published : Apr 1, 2019, 8:53 PM IST

65వ జాతీయ రహదారి పెరిగిన టోల్​ చార్జీలు
హైదరాబాద్​ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు టోల్​ ఛార్జీల మోత మోగింది. 65వ నంబరు జాతీయ రహదారిపై టోల్​ రుసుములు పెరిగాయి. ఈ ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. వాహన సామర్థ్యాన్ని బట్టి ఐదు నుంచి 860 రూపాయల వరకు పెంచినట్లు జీఎమ్​ఆర్​ సంస్థ ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఏడాదికి ఒకసారి టోల్ ఛార్జీలు పెంచుకునే వీలుందని తెలిపింది. ఈ అదనపు భారంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికోసారి పెంచితే తాము ప్రయాణించేదెట్లా అని వాపోతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details