నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని పిల్లల విభాగానికి.. తెలంగాణ పిల్లల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో అధునాతన వెంటిలేటర్ అందించారు. నిజామాబాద్, కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రులకు ఒక్కొక్కటి చొప్పున వెంటిలేటర్ అందించినట్టు సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ తెలిపారు. ప్రస్తుత కొవిడ్ నేపథ్యంలో పిల్లలకు అత్యవసర చికిత్స నిమిత్తం రూ.4 లక్షలు విలువ చేసే.. వెంటిలేటర్ అందించినట్టు నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్ ప్రతిమారాజ్ అన్నారు. ఇప్పటి వరకు అధునాతన వెంటిలేటర్ సౌకర్యం హైదరాబాద్, వరంగల్‌లో మాత్రమే ఉండేదని.. ఇప్పుడు నిజామాబాద్, కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రులకు కూడా అందించామని తెలంగాణ పిల్లల వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి యశ్వంత్ రావు అన్నారు.
పిల్లల విభాగానికి వెంటిలేటర్.. అందించిన వైద్యుల సంఘం! - పిల్లల విభాగానికి వెంటిలేటర్ అందజేత
తెలంగాణ పిల్లల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల విభాగానికి అధునాతన వెంటిలేటర్ అందించారు. పిల్లలకు అత్యవసర చికిత్స సమయంలో అవసరమయ్యే అధునాతన వెంటిలేటర్‌ను నిజామాబాద్, కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రుల పిల్లల విభాగానికి ఒక్కొక్కటి చొప్పున అందించినట్టు తెలంగాణ పిల్లల వైద్యుల సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ తెలిపారు.
పిల్లల విభాగానికి వెంటిలేటర్.. అందించిన వైద్యుల సంఘం!