నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షాలు రైతన్నకు కన్నీళ్లు మిగిల్చాయి. భారీ వర్షాలకు కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యాయి. కోత దశకు చేరిన పైరు నేలవాలింది. ఆరుగాలం కష్టించి పడించిన రైతుకు నష్టం వాటిల్లింది.
ఆకాల వర్షం... అన్నదాతకు అపార నష్టం
నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు.. రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాం తడిసిపోయింది.
ఆకాల వర్షం... అన్నదాతకు అపార నష్టం
ఆకస్మిక వర్షాలతో కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లోని మిగిలిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఇవీచూడండి:బంగాళాఖాతంలో వాయుగుండం.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు