తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా సాగుతున్న దేవి శరన్నవరాత్రోత్సవాలు

Navratri Celebrations In Telangana: రాష్ట్రవ్యాప్తంగా దేవీ నవరాత్రోత్సవాలు రెండోరోజు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరుతున్నారు. అర్చకులు అమ్మవారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో రోజుకోరూపంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు.

Navratri Celebrations
Navratri Celebrations

By

Published : Sep 27, 2022, 7:39 PM IST

Navratri Celebrations In Telangana: రాష్ట్రవ్యాప్తంగా దసరా నవరాత్రోత్సవాలు రెండో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో అమ్మవారు బ్రహ్మచరిని అవతారంలో దర్శనమిచ్చారు. అర్చకులు కుంకుమార్చన చేశారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో అమ్మవారు సంతాన లక్ష్మీ అవతారంలో దర్శనమిచ్చారు. రామాయణ పారాయణం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఓరుగల్లు శ్రీ భద్రకాళి ఆలయం అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. అమ్మవారిని అన్నపూర్ణ అవతారంలో అలంకరించారు. ఉదయం మకర సేవ నిర్వహించిన అర్చకులు... సాయంత్రం చంద్రప్రభ వాహనంపై ఊరేగించారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో దేవి నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమాలు చేశారు. హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని రాజస్థానీ సేవా సంఘం ట్రస్టు ఆధ్వర్యంలో దేవి నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సినీనటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్‌ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details