తెలంగాణ

telangana

ETV Bharat / city

'బతుకమ్మ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నాం'

కరీంనగర్‌లో బతుకమ్మ నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని మేయర్​ సునీల్​రావు తెలిపారు. కమిషనర్​‌ క్రాంతితో కలిసి ఆయా ప్రాంతాల్లోని చెరువులను మేయర్​ పరిశీలించారు. చెరువుల వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

'బతుకమ్మ నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం'
'బతుకమ్మ నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం'

By

Published : Oct 21, 2020, 3:50 PM IST

కరీంనగర్‌లో 15 ప్రాంతాల్లో బతుకమ్మ నిమజ్జనానికి ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ సునీల్‌రావు తెలిపారు. ఈసారి నగరపాలక సంస్థలోకి కొన్ని గ్రామపంచాయతీలు కూడా విలీనమైన దృష్ట్యా ఆయా ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కమిషనర్​‌ క్రాంతితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. కిసాన్‌నగర్​లోని గార్లకుంట, రేకుర్తిలోని పెంటమ్మ చెరువు స్థలాలను పరిశీలించారు.

ఈసారి భారీ వర్షాలు నమోదైన దృష్ట్యా నిమజ్జనానికి వెళ్లినప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఏర్పడకూడదనే ఉద్దేశంతో బారికేడింగ్ చేయడమే కాకుండా గోతులు పూడ్చడం, లైటింగ్ సదుపాయం కల్పిస్తామని మేయర్‌ తెలిపారు. నగరంలోని ఒక్కో డివిజన్‌లో బతుకమ్మ ఆడుకోవడానికి వీలుగా తగిన సదుపాయాలు కల్పించేందుకు రూ.50 లక్షలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ నిమజ్జనానికి రూ. కోటిన్నర ఖర్చు చేస్తున్నామని దాదాపు 15చోట్ల నిమజ్జనానికి తగుచర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ సునిల్‌రావు వివరించారు.

ఇదీ చూడండి: రాష్ట్రానికి కేంద్రం నుంచి బృందాలు పంపిస్తున్నాం: కిషన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details