కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సదాశివపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీకొంది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు దుర్మరణం - karimnagar crime news
కరీంనగర్ జిల్లా సదాశివపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
సదాశివపల్లి వద్ద లారీని నిలిపిన డ్రైవర్ రోడ్డు దాటుతుండగా.. ద్విచక్రవాహనంతో అతివేగంగా వచ్చిన ముగ్గురు యువకులు ఢీకొట్టారు. ఘటనలో లారీ డ్రైవర్ వెంకటేశ్వర్లుతోపాటు, మరో యువకుడు మహమ్మద్ సల్మాన్ దుర్మరణం చెందారు. మరో యువకుడికి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురు యువకులు మద్యం తాగేందుకు కరీంనగర్ నుంచి సదాశివపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని తేల్చారు. లారీ డ్రైవర్ ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. అనంతరం రెండు మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇవీచూడండి:తాగిన మైకంలో భర్తను చంపిన భార్య