తెలంగాణ

telangana

ETV Bharat / city

Kuppam elections 2021: చంద్రబాబును కుప్పం రానివ్వొద్దు.. ఎస్ఈసీకి వైకాపా ఫిర్యాదు

కుప్పం మున్సిపాలిటీ(Kuppam elections 2021) ఎన్నికల్లో తెదేపా అక్రమాలకు పాల్పడుతోందంటూ.. ఏపీ ఎన్నికల సంఘానికి వైకాపా ఫిర్యాదు చేసింది. తెదేపా అధినేత చంద్రబాబును కుప్పం రాకుండా నిలువరించాలని(Kuppam elections 2021) విజ్ఞప్తి చేసింది.

By

Published : Nov 15, 2021, 7:00 PM IST

kuppam municipality
కుప్పం

ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల సంఘానికి వైకాపా ఫిర్యాదు చేసింది. తెదేపా అక్రమాలకు పాల్పడుతోందంటూ తమ ఫిర్యాదులో పేర్కొంది. కుప్పం(Kuppam elections 2021) లో వారం రోజులుగా తెదేపా అక్రమాలకు పాల్పడుతోందని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు.

తెదేపా అధినేత చంద్రబాబు కుప్పానికి(Kuppam elections 2021) వెళ్లాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబును కుప్పం మున్సిపాలిటీకి వెళ్లకుండా నిలువరించాలని కోరారు. తమ ఫిర్యాదుపై ఎన్నికల అధికారులు సానుకూలంగా స్పందించినట్లు అప్పిరెడ్డి తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ వైకాపా(Kuppam elections 2021).. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. చంద్రబాబు నాయుడు ఎన్నికల కోడ్​ను ఉల్లంఘిస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని వైకాపా నేతలు కోరారు. కుప్పం సహా మిగిలిన చోట్ల స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు అక్రమాలు చేస్తూ డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచుతూ అక్రమాలు చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. టెలీకాన్ఫరెన్సుల ద్వారా కుప్పం ఒటర్లను భయపెడుతూ, ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వీటికి సంబంధించి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు అప్పిరెడ్డి తెలిపారు.

ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుంటే వాటిని అడ్డుకునేందుకే చంద్రబాబు కుప్పం(Kuppam elections 2021) వెళ్తున్నారని.. ఆయన పర్యటనను అడ్డుకోవాలని ఎస్​ఈసీని కోరారు. చంద్రబాబుకు కుప్పంలో ఓటు లేదని.. ఎన్నికలను అడ్డుకునేందుకు దురాలోచనతోనే కుప్పానికి వెళ్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దౌర్జన్యాలతో ఎన్నికలను అడ్డుకునేెందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. తక్షణం చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బతికించాలని ఎస్ఈసీని కోరగా సానుకూలంగా స్పందించినట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై తెలంగాణ ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details