ఆర్.కె. కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో... అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్లో వినూత్నంగా జరిగాయి. మ్యూజిక్, డాన్స్ ఫెస్టివల్ పేరిట రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి 250 మంది కళాకారులు పాల్గొన్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరంతరాయంగా.. చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేసి చూపరులను ఆకట్టుకున్నారు.
ఆకట్టుకున్న మ్యూజిక్, డాన్స్ ఫెస్టివల్
మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన మ్యూజిక్, డాన్స్ ఫెస్టివల్ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి 250 మంది కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఆకట్టుకున్న మ్యూజిక్, డాన్స్ ఫెస్టివల్
ప్రైమ్ వరల్డ్ రికార్డ్స్ కోసం ఈ ప్రయత్నం చేసినట్లు పౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రంజిత్ తెలిపారు. భారతీయ సంస్కృతి , సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసేందుకు.. చిన్నారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి:ఆకాశంలో వింతదృశ్యం.. దుమ్మురేపుతున్న భానుడు!