తెలంగాణ

telangana

ETV Bharat / city

Ravvala Konda Mining: కరుగుతున్న కాలజ్ఞాన కొండ... కానరాని అండ - రవ్వలకొండ తాజా వార్తలు

Ravvala Konda Mining:ఏపీలోని కర్నూలు జిల్లాలో ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న రవ్వలకొండ అక్రమార్కుల అడ్డగోలు తవ్వకాలతో కరిగిపోతోంది. ఇష్టానుసారం తవ్వకాలు చేపట్టడంతో ఎంతో ప్రాధాన్యమున్న బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అక్రమ తవ్వకాలను నిరసిస్తూ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విశ్వబ్రహ్మణుల సమాఖ్య చలో రవ్వలకొండ కార్యక్రమం నిర్వహించారు. అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు...

Ravvala Konda Mining
కరుగుతున్న కాలజ్ఞాన కొండ

By

Published : Mar 24, 2022, 5:27 PM IST

Ravvala Konda Mining: పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని... ఏపీ నలుమూలల నుంచి వచ్చిన విశ్వబ్రాహ్మణులు మొదట బనగానపల్లె చేరుకున్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రవ్వలకొండ గుహను సందర్శించారు.

Visva Brahmins: ఏపీలోని కర్నూలు జిల్లా బనగానపల్లికి ఆనుకుని రవ్వలకొండ ఉంది. అచ్చమాంబ ఇంట్లో పశువుల కాపరిగా ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి.. రవ్వలకొండ పరిసర ప్రాంతాల్లో పశువులను మేపేవారని ప్రతీతి. ఎంతో ప్రశాంత వాతావరణం కలిగిన రవ్వలకొండలో.. పశువుల చుట్టూ గీత గీసి.. సమీపంలోని గుహలో కూర్చుని కాలజ్ఞాన తత్వాలు రాసేవారట. ఆయన గీసిన గీతను పశువులు దాటేవి కాదని చెబుతుంటారు.

కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ గుహలో.. బ్రహ్మంగారు, అచ్చమాంబ విగ్రహాలు ఉన్నాయి. ఈ గుహలోంచి శ్రీశైలం, యాగంటికి మార్గాలు ఉన్నట్లు రాసి ఉంది. బ్రహ్మంగారి విగ్రహానికి నిత్య పూజలు జరుగుతాయి. వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు, పర్యాటకులు.. ఈ ప్రాంతానికి వచ్చి.. బ్రహ్మంగారు నడయాడిన ప్రాంతాలను తిలకిస్తుంటారు.

Ravvala Konda Mining: 21 ఎకరాల ప్రభుత్వ, 11 ఎకరాల అటవీశాఖ భూముల్లో మైనింగ్‌కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 10 చోట్ల మెటల్ తవ్వకాలు జరుగుతున్నాయి. దీని కోసం.. ఇష్టారాజ్యంగా పేలుళ్లు జరుపుతున్నారు. అనుమతులు తీసుకున్నట్లు చెబుతున్నా.. పరిధి దాటి మైనింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల ఈ ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉందని ఏపీ విశ్వబ్రాహ్మణుల సంఘం నాయకులు చెబుతున్నారు.

Ravvala Konda Mining: గతంలో తవ్వకాల కారణంగా.. రవ్వలకొండ గుహలో.. పగుళ్లు వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి. ఏకంగా కొండపైనే.. డంప్​ను ఏర్పాటు చేసుకోవటం సహా వాహనాలను సైతం అక్కడే పార్కింగ్ చేస్తున్నారు. ఇదే విధంగా కొండను తవ్వటం.. బ్లాస్టింగ్ చేయటం వల్ల.. ఏదో ఒక రోజు గుహ కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి.. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని.. బనగానపల్లి మాజీ శాసనసభ్యుడు బీసీ జనార్థన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

Ravvala Konda Mining: ఎంతో చరిత్ర కలిగిన రవ్వల కొండను ఇప్పటికైనా కాపాడాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారు నడయాడిన ప్రాంతంలో.. మైనింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కరుగుతున్న కాలజ్ఞాన కొండ
అదీ చదవండి: GOVERNOR TAMILISAI: తెలంగాణ ఫార్మా పరిశ్రమకు హబ్‌గా మారింది: తమిళిసై

ABOUT THE AUTHOR

...view details