తెలంగాణ

telangana

By

Published : Dec 6, 2020, 6:51 PM IST

Updated : Dec 6, 2020, 8:26 PM IST

ETV Bharat / city

అమిత్ షాను కలిసిన విజయశాంతి... రేపు భాజపాలో చేరిక!

vijayashanthi meet amith saha
vijayashanthi meet amith saha

18:51 December 06

అమిత్ షాను కలిసిన విజయశాంతి... రేపు భాజపాలో చేరే అవకాశం

కేంద్ర మంత్రి అమిత్​షాతో భేటీ అయిన విజయశాంతి

అంతా అనుకున్నట్లే... సినీ నటి, కాంగ్రెస్‌ నేత విజయశాంతి... భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం అయ్యింది. ఈ మేరకు ఆమె... దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమితిషాను కలిశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆమె వెంట ఉన్నారు. 

రేపు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో... విజయశాంతి భాజపా తీర్థం పుచ్చుకోనున్నారు. మరికొంత మంది ఇతర పార్టీల నాయకులు... రేపు కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది. 

Last Updated : Dec 6, 2020, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details