తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆయన ప్రాణం కాపాడండి: వరవరరావు సతీమణి హేమలత

వరవరరావు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయిందని, మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలని ఆయన భార్య హేమలత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కనీసం తమను గుర్తుపట్టడం లేదంటే... ఆయన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

varavara rao wife request to government for save him
కనీసం ఆయన ప్రాణం కాపాడండి: హేమలత

By

Published : Jul 12, 2020, 12:24 PM IST

వరవరరావు ఆరోగ్యంపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పది రోజుల నుంచి ఎదురుచూస్తుంటే... శనివారం సాయంత్రం ఫోన్​ వచ్చింది. తన ఆరోగ్యం గురించి అడుగుతుంటే... ఆయనకు 8 ఏళ్లప్పుడు చనిపోయిన నాన్న, 31 ఏళ్ల క్రితం చనిపోయిన తల్లి, ఇప్పుడు చనిపోయారని మాట్లాడుతున్నారని ఆమె తెలిపారు. అంటే ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. మమ్మల్ని ఎవర్నీ గుర్తుపట్టడం లేదు. పక్కనున్న అటెండెంట్​ తీసుకొని ఆయన ఆరోగ్యం బాగా లేదు, వ్యక్తిగత పనులకు కూడా ఇతరుల మీద ఆధారపడుతున్నారు.. సరైన వైద్యం అందడం లేదని చెప్పినట్టు ఆమె వివరించారు.

వరవరరావు ఆరోగ్యం బాగా లేదని మే 26న జైలు సిబ్బంది సమాచారమిచ్చినట్టు హేమలత తెలిపారు. మే 28న జేజే ఆసుపత్రికి తరలించినట్టు చిక్కడపల్లి పోలీసులు చెప్పినట్టు ఆమె వివరించారు. జూన్​ 24న ఫోన్​ చేసినప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడినట్టు చెప్పారు. శనివారం పూర్తిగా ఆరోగ్యం క్షీణించినట్టు శనివారం ఆ?న మాటల్లో తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ఆయన ప్రాణాలు కాపాడాలని... తెలంగాణ, మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఆమె విజ్ఞప్తి చేశారు.

కనీసం ఆయన ప్రాణం కాపాడండి: హేమలత

ఇదీ చూడండి:అనుపమ్ ఖేర్ తల్లితో పాటు సోదరుడి కుటుంబానికి కరోనా

ABOUT THE AUTHOR

...view details