శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేసి కొవిడ్ టీకాను తయారు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాడుకలోకి వచ్చిన నాలుగు కంపెనీల టీకాల్లో రెండు భారత్‌కు చెందినవేనని తెలిపారు.
ప్రపంచంలోని నాలుగు టీకాల్లో రెండు మనవే: కిషన్ రెడ్డి - Kishan Reddy on Covid Vaccine
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని.. అన్ని వర్గాల వారికి టీకా అందించేందుకు ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 130 కోట్ల జనాభాకు టీకాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు.
కరోనా పోరులో ముందు నిలిచిన వారికి తొలి విడతలో టీకా అందిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. కొవిడ్ బాధితులకు సేవలందించిన వారికి ముందు ప్రాధాన్యమిద్దామన్నారు. రెండో విడతలో 50 ఏళ్లు దాటిన వారికి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. టీకా రెండు డోసులు తీసుకుంటేనే సత్ఫలితాలుంటాయని, తప్పనిసరిగా అందరూ రెండు డోసులు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు.
టీకాల కోసం ఇప్పటికే 150 దేశాలు భారత్‌ను సంప్రదిస్తున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం సాగుతుందని స్పష్టం చేశారు. 130 కోట్ల జనాభాకు టీకాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుందని అన్నారు.
- ఇదీ చూడండి :అధైర్యమొద్దు... అందరికీ టీకా ఇస్తాం: మంత్రి ఈటల