సికింద్రాబాద్‌లో కారు... బైక్‌ను ఢీ కొట్టడం వల్ల ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్వాల్ నుంచి సుచిత్ర వైపు వెళ్లే రోడ్డులో కారు.... బైక్‌ను అతివేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రియదర్శిని అనే మహిళ మృతి చెందగా... అయాన్ వుడ్ అనే వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన మరో వ్యక్తి వరుణ్‌ను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటన తరువాత నిందితుడు కారును వదిలేసి వెళ్లిపోయాడు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సికింద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదం, ఇద్దరి మృతి
సికింద్రాబాద్‌లో అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గాయపడిన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సికింద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి