శ్రీనివాసరెడ్డి మృతికి కేసీఆర్‌దే బాధ్యత: అశ్వత్థామరెడ్డి - khammam rtc driver srinivas reddy condolence meet
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రుల రెచ్చగొట్టే మాటల వల్లే ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. రేపు ఉదయం అన్ని డిపోల్లో శ్రీనివాసరెడ్డి సంతాప సభలు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస రెడ్డి మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులే కారణమని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. కార్మికులెవరూ ఆవేశపడి ఆత్మహత్యలకు పాల్పడొద్దని సూచించారు. కార్మికులంతా సంయమనం పాటించాలని, కలిసి పోరాడదామన్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద కొవ్వొత్తుల ర్యాలీ చేస్తామని తెలిపారు. రేపు ఉదయం శ్రీనివాస రెడ్డి సంతాప సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. అన్నివర్గాల కార్మికులు పాల్గొని మద్దతు తెలపాలని కోరారు.
- ఇదీ చూడండి : రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్