Entrance exams Dates: ఇంటర్ ఎంపీసీ, బైపీసీ పరీక్షలు మే 7వ తేదీతో ముగుస్తాయి. పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థుల చివరి సెమిస్టర్ పరీక్షలు జూన్ మొదటి వారానికి పూర్తవుతాయి. ఈ క్రమంలో ఎంసెట్, ఈసెట్‌లను జూన్ నెలాఖరులో జరపాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మిగిలిన ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్, పీజీ ఇంజినీరింగ్ సెట్‌లను జులైలో చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. తాజాగా ఎంసెట్ నోటిఫికేషన్ మార్చి 14న రానున్నట్లు తెలుస్తోంది.
TS EAMCET: మార్చి 14న టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్..!
TS EAMCET NOTIFICATION DATE: రాష్ట్రంలో ఎంసెట్ నోటిఫికేషన్ మార్చి 14న వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7నుంచి జరగుతున్న ఎంసెట్, ఈసెట్, ఐసెట్ కమిటీ సమావేశాల్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
డిగ్రీ విద్యార్హత కలిగిన వారే ఈ అయిదు ప్రవేశ పరీక్షలకు (లాసెట్‌లో అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీకి ఇంటర్‌వారు అర్హులు) హాజరవుతారు. వారికి చివరి సెమిస్టర్ పరీక్షలు జూన్ నెలాఖరు వరకు జరుగుతాయి. తర్వాత వారం, పది రోజుల సమయం ఇచ్చి జులైలో ప్రవేశ పరీక్షలను జరపాలని ఉన్నత మండలి నిర్ణయించింది. సెమిస్టర్ పరీక్షలకు ముందు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే దృష్టి కేంద్రీకరించలేరని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి చెప్పారు.
ఇదీ చూడండి:CM KCR to Visit Yadadri Temple : రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్