వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరితో రైతులకు తీవ్రనష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) పునరుద్ఘాటించారు. అన్నదాతలకు అండగా.. కేంద్రంపై యుద్ధాని(TRS dharna against central government)కి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలు చేకూరే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ విషయంలో ఉత్తరాది రైతులతో కలిసి కేంద్రంపై పోరాడతామని అన్నారు. వరిధాన్యం కొనుగోళ్ల(paddy procurement)లో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెరాస తలపెట్టిన మహాధర్నా(TRS dharna in Hyderabad) ప్రారంభమైంది. ఈ ధర్నా(TRS dharna at Indira park)లో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎమ్మెస్, రైతుబంధు సమితులు, మార్కెట్ కమిటీల ఛైర్మన్లు పాల్గొన్నారు.
తెలంగాణ రైతుల బాధ(Telangana farmers problems) దేశానికి తెలిసేలా ఆందోళన చేస్తామని కేసీఆర్ (Telangana CM KCR) స్పష్టం చేశారు. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, పట్టణాల్లోనూ ఈ పోరాటం సాగిస్తామని తెలిపారు. ఈ పోరాటం ఉద్ధృతమై ఉప్పెనలా మారి కేంద్రాన్ని ఆలోచింపజేసే వరకు పోరాడతామని చెప్పారు. మోదీ సర్కార్ దిగొచ్చి ధాన్యం కొనుగోలు చేసే వరకు ధర్నాలు(TRS Dharna across telangana state) చేస్తామని అన్నారు.
"రైతులకు మద్దతుగా ధర్నా(TRS dharna over paddy procurement) చేపట్టాం. మహాధర్నాకు వచ్చిన అందరికి స్వాగతం. దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. కానీ ఇప్పుడు కేంద్ర సర్కార్ రాష్ట్ర రైతులకు నష్టం చేకూర్చాలని ప్రయత్నిస్తోంది. పంజాబ్ తరహాలోనే రాష్ట్రంలోనూ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఇప్పటివరకు కేంద్రం ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తోంది. నిన్నే స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాశాను. వివిధ పోరాటాల మార్గాన్ని ఎంచుకుని పోరాడతాం. రైతులకు ప్రయోజనాలు చేకూరే వరకు మా పోరాటం ఆగదు."