తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​లో హైసెక్యూరిటీ.. ఆ మార్గాల్లో ట్రాఫిక్​​ ఆంక్షలు.. - Prime minister modi

Traffic restrictions in Hyderabad: హైదరాబాద్​కు ప్రధాని రాక సందర్భంగా పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. ఆయా మార్గాల గుండా వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ దారులను సూచించారు. హెచ్​ఐసీసీ ప్రాంతంలోని పలు కార్యాలయాలపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి వేళల్లో డీసీపీ స్థాయి అధికారులు ట్రాఫిక్​ను పర్యవేక్షించనున్నారు.

Traffic restrictions in Hyderabad due to modi visit
Traffic restrictions in Hyderabad due to modi visit

By

Published : Jun 30, 2022, 5:40 PM IST

Traffic restrictions in Hyderabad: జులై 2, 3వ తేదీల్లో హైదరాబాద్‌ హెచ్​ఐసీసీలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర పోలీసుశాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశాలకు ప్రధాని మోదీతో పాటు 40 మంది కేంద్ర ప్రముఖులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, వందల మంది పార్టీ నాయకులు రెండు రోజులపాటు నగరంలో బసచేయనుండటంతో వారి భద్రతను అధికారులు సవాలుగా తీసుకుంటున్నారు. ఎక్కడా ఏ చిన్న పొరపాటుకూ తావులేకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయడంలో తెలంగాణ పోలీసు శాఖ నిమగ్నమైంది.

ట్రాఫిక్​ ఆంక్షలు అందుకే..: హెచ్‌ఐసీసీ ప్రాంగణాన్ని హైసెక్యూరిటీ జోన్‌గా ప్రకటించనున్న పోలీసులు.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సమావేశంలో పాల్గొనే ప్రముఖులు విమానాశ్రయం నుంచి వేర్వేరు సమయాల్లో వారి విడిదికి, అక్కడ నుంచి సమావేశ ప్రాంగణానికి రానున్నారు. ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు బేగంపేట విమానాశ్రయానికి, అక్కడ నుంచి హెచ్‌ఐసీసీకి హెలికాప్టర్‌లోనే వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలం కావడంతో హెలికాప్టర్‌ ఎగరడానికి ఇబ్బందులు వస్తే రోడ్డు మార్గంలోనే వెళ్లనున్నారు. దాంతో ఈ రహదారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా పంజాబ్‌లో ప్రధాని ప్రయాణిస్తున్న రహదారిని దిగ్బంధించిన ఉదంతం నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కార్యాలయాలపై కూడా ఆంక్షలు..: 2, 3 తేదీలో సెలవు దినాలు కావడంతో ఈ ప్రాంతంలో కార్యాలయాలు పనిచేయవు. ఒకవేళ ఏవైనా పనిచేసినా.. పనివేళల్లో మార్పులు చేసుకోవాలని పోలీసులు సూచించారు. కావూరి హిల్స్- కొత్తగూడ వరకు ఉన్న కంపెనీలపై పోలీసులు ఆంక్షలు విధించారు. హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ నుంచి ఐకియా రోటరీ వరకూ ఉన్న కంపనీలపై కూడా ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. స్థానికంగా అనేక మాల్స్‌ ఉండటంతో వారాంతాల్లో రద్దీని ఎలా నియంత్రించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు.

డీసీపీ స్థాయి అధికారులతో పర్యవేక్షణ..: హెచ్ఐసీసీకి సైబరాబాద్ నేర విభాగం డీసీపీ కల్మేశ్వర్​ను బాధ్యుడిగా ఉంచారు. నోవాటెల్​కు సీసీఎస్ డీసీపీ కవితను బాధ్యురాలిగా ఉంచారు. ఈ రెండింటిని కలిపి సంయుక్త సీపీ అవినాష్ మొహంతి పర్యవేక్షించనున్నారు. హైటెక్స్ ప్రాంగణంలో ఉన్న రహదారిపై రాకపోకలకు బాధ్యుడిగా డీసీపీ వెంకటేశ్వర్లు వ్యవహరించనున్నారు. రాత్రి వేళల్లో భద్రతను పర్యవేక్షించనున్న డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. ట్రాఫిక్‌పరంగా ఇబ్బందులు తలెత్తకుండా డీసీపీ శ్రీనివాస్ ప్రణాళిక రచిస్తున్నారు. హెచ్ఐసీసీలో 300మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. నోవాటెల్, ఇతర పంచతార హోటళ్లలోనూ డీసీపీ స్థాయి అధికారికి భద్రతాపరమైన బాధ్యతలు అప్పజెప్పగా... ఇతర శాఖల అధికారులు వసతికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ప్రధాని మోది ఎక్కడ బస చేస్తారనే విషయాన్ని ఎస్పీజీ అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు.

ప్రత్యేక సీసీకెమెరాలు..: ప్రముఖుల విడిది, సమావేశ ప్రాంగణం చుట్టూ ఇప్పటికే ఉన్నవాటికి అదనంగా ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం హెచ్‌ఐసీసీలోనే కమాండ్‌ కంట్రోల్‌ను నెలకొల్పుతుండగా సైబరాబాద్‌ కంట్రోల్‌ రూం నుంచీ వాటిని పర్యవేక్షించనున్నారు. హెచ్‌ఐసీసీ ప్రాంగణం, దానికి దారితీసే రహదారుల్లో అనుమానాస్పద వస్తువులు, వాహనాలు ఉంటే కృత్రిమ మేథ ద్వారా సీసీ కెమెరాలు గుర్తించి భద్రత సిబ్బందిని హెచ్చరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్రాఫిక్​ ఆంక్షల నేపథ్యంలో పోలీసుల సూచనలు..

  • నీరూస్ కూడలి నుంచి కొత్తగూడా, గచ్చిబౌలి కూడళ్ల వైపు వెళ్లే వాహనాలు.. సీఓడి కూడలి- దుర్గం చెరువు- ఇనార్బిట్ మాల్- ఐకియా మీదుగా వెళ్లాలని సూచన
  • మియపూర్, కొత్తగూడా, హఫీజ్​పేట్ మీదుగా హైటెక్ సిటీ వైపు వచ్చే వాసహనాలు.. సైబర్ టవర్స్- జూబ్లీహిల్స్- ఏఐజీ ఆస్పత్రి- ఇనార్బిట్ మాల్- దుర్గం చెరువు మీదుగా వెళ్లాలని సూచన
  • ఆర్సీపురం, చందానగర్ నుంచి మాదాపూర్ వైపు వచ్చే వాహనాలు.. గచ్చిబౌలి- బీహెచ్​ఈఎల్- నలగండ్ల- హెచ్​సీయూ మీదుగా కొండాపూర్​కు మళ్లింపు
  • కావూరీహిల్స్ నుంచి కొత్తగూడ, బయోడైవర్సిటీ నుంచి జేఎన్టీయూ, నారాయణమ్మ కళాశాల నుంచి గచ్చిబౌలి మార్గాల్లో.. భారీ వాహనాలకు అనుమతి నిరాకరణ

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details