Revanth reddy Comments: రాష్ట్రంలో 24 గంటల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి వడ్లు కొనటం ప్రారంభించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ధాన్యం కొనుగోలుపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న దొంగనాటకాలు కట్టిపెట్టాలని హెచ్చరించారు. రైతుల నుంచి చివరి వరిగింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పక్షాన పోరాటం చేసి.. వారికి అండగా ఉంటామని రేవంత్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకొని రైతులకు భరోసా కల్పించాలన్నారు. లేకపోతే.. రైతులందరిని కూడగట్టి ఎక్కడికక్కడ మంత్రులు, తెరాస నేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు.