ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు' గల్లీల్లో గల్లలెగరేసుకుని తిరిగేలా చేస్తా..' Bandi sanjay Comments: జాతీయ పంచాయతీరాజ్ దివాస్ సందర్భంగా పాదయాత్రలో భాగంగా.. నారాయణపేట జిల్లా నర్వలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో బండి సంజయ్ సమావేశమయ్యారు. కొత్తచట్టం పేరుతో సర్పంచులకు అధికారాలే లేకుండా చేశారని తెరాస ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని, జడ్పీటీసీలంటే ఎవరో తెలియకుండా చేశారని మండిపడ్డారు.బాలికపై అత్యాచారం.. నిందితుడికి రిమాండ్Rape on Minor Girl: నిజామాబాద్ జిల్లాలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం(ఏప్రిల్ 22) సాయంత్రం జరిగిన బాలికపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్పందించిన పోలీసులు.. చర్యలు తీసుకున్నారు.అందువల్లే పోలవరంపై నీలినీడలు Gorantla fire on YSRCP: రంకెలేస్తే పోలవరం పూర్తికాదనే సంగతి ఏపీ మంత్రి అంబటి రాంబాబు గ్రహించాలని.. తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు పూర్తిపై నీలినీడలు కమ్ముకున్నాయని విమర్శించారు.ఇదెక్కడి ఓపెనింగయ్యా సామీ..!MLA Sofa Opening: కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా ప్లాన్ చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే ధర్వాజకు కట్టిన రిబ్బన్‌ను కత్తెరతో కట్ చేశారు. ఇంకేముంది కార్యాలయం ఓపెనింగ్ అయిపోయినట్టే అనుకుంటే పొరపాటే.. ఆఫీస్‌లోకి కొత్తగా కొనుక్కొచ్చిన సోఫాలు, కుర్చీలను ఎవరు ప్రారంభించాలి..? వాటిని కూడా ఎమ్మెల్యేనే రిబ్బన్లు కత్తిరించి ప్రారంభించాలి..! అలాగే చేశారు కూడా..!! ఎక్కడ..? ఎవరో చూడండి.. లొంగిపోయిన ఆశిష్ మిశ్ర Ashish Mishra surrender: లఖింపుర్ ఖేరీ నిందితుడు ఆశిష్ మిశ్ర.. జిల్లా కోర్టులో ఆదివారం లొంగిపోయారు. వారం రోజుల లోపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల మేరకు ఒకరోజు ముందే జిల్లా కోర్టులో సరెండర్ అయ్యారు.సర్కారు బ్యాంకులో భారీగా ఉద్యోగాలు..Bank of India Recruitment: బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెద్ద సంఖ్యలో ఖాళీలు భర్తీ కానున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. ఆ వివరాలు ఇలా..ప్రసవం కోసం 4 కిలోమీటర్లు డోలీలోనే..! రోడ్డు సౌకర్యం లేక నిండు గర్భిణీని ప్రసవం కోసం నాలుగు కిలోమీటర్ల దూరం.. డోలీలో మోసుకువెళ్లిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. పాల్ఘర్ జిల్లాలోని ముకుందపాద అనే గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. తాలూకా కేంద్రానికి సైతం ఆ గ్రామం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 'నిత్యం రూ.20వేల కోట్ల డిజిటల్ లావాదేవీలు'Modi Mann Ki Baat today: చిన్న ఆన్‌లైన్ చెల్లింపులే పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో దోహదం చేస్తున్నాయన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దేశంలో నిత్యం రూ.20వేల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.చాక్లెట్ అనుకొని ఎలుకల తిన్న చిన్నారి! Eat rat poison Nagpur: మహారాష్ట్రలో విషాదకర ఘటన జరిగింది. చాక్లెట్ అనుకొని ఎలుకల మందు తిని నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.'హరిహర వీరమల్లు'లో బాలీవుడ్ హాట్ బ్యూటీ?పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో కీలక పాత్రల్లో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ కనిపించనున్నారు. వారితో పాటు బాలీవుడ్ హాట్‌బ్యూటీ నటించబోతున్నారట. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.