తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA

By

Published : Feb 20, 2022, 4:59 PM IST

  • ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి..

CM KCR Mumbai Tour: కేంద్రంలో భాజపా వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో... తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమావేశం అయ్యారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా సమాలోచనలు చేశారు.

  • తెలంగాణలో ప్రాచీన కళల పరిరక్షణకు కృషి..

Srinivas goud About Arts : ప్రాచీన కళల పరిరక్షణకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నాని పేర్కొన్నారు. స్వార్ మహతి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 25న నిర్వహించనున్న సృజనోత్సవ్ - 2022 లోగోను ఆవిష్కరించారు.

  • రాజాసింగ్​పై కేసు నమోదు..

Case on Rajasingh: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్​కు ఓటు వేయాలంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయగా... రాజాసింగ్ స్పందించలేదు. దీంతో ఆయనపై మంగళ్​హాట్​ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది.

  • ఉగ్రవాదులంటే ఆ పార్టీలకు జాలి..

PM Modi in Hardoi: ఉత్తర్​ప్రదేశ్​లోని హర్దోయ్​ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అహ్మదాబాద్​ వరుస బాంబు దాడులను గుర్తు చేసుకున్నారు. అలాంటి దాడులు చేస్తున్న ఉగ్రవాదుల పట్ల కొన్ని పార్టీలు సానుభూతి చూపుతున్నాయని విమర్శించారు.

  • సోనూసూద్​కు ఈసీ వార్నింగ్..

Sonu Sood: పంజాబ్​ ఎన్నికల్లో భాగంగా ఓ పోలింగ్​ బూత్​ను పరిశీలించేందుకు ప్రయత్నించిన బాలీవుడ్​ నటుడు సోనూసూద్​ను అధికారులు అడ్డుకున్నారు. తన కారును స్వాధీనం చేసుకుని తిరిగి ఇంటికి పంపించారు. ఇంట్లోంచి రావొద్దని స్పష్టం చేశారు. అయితే.. పోలింగ్​ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకే వచ్చినట్లు సోనూసూద్​ తెలిపారు.

  • స్కార్పియో కోసం వివాహిత సజీవదహనం..

Husband Burns Wife: వరకట్న వేధింపులు వివాహిత ప్రాణాన్ని బలిగొన్నాయి. స్కార్పియో ఇవ్వలేదని.. తన సోదరిని సజీవ దహనం చేసినట్లు మృతురాలి సోదరుడు ఆరోపించారు. బిహార్​లోని నవాదాలో ఈ ఘటన జరిగింది.

  • ఈపీఎఫ్​ఓ కొత్త స్కీం.. వాళ్లకు మాత్రమే..

EPFO New Pension Sceme: నెలకు రూ.15,000 కంటే ఎక్కువ మూల వేతనం(బేసిక్​ శాలరీ) కలిగిన సంఘటిత కార్మికుల కోసం ఈపీఎఫ్‌ఓ ఓ కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఈపీఎఫ్​ఓ పరిధిలోకి తప్పనిసరిగా రాని ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

  • రంజీల్లో యశ్​ ధుల్ రికార్డు..

Yash Dhull Ranji Trophy: యువక్రికెటర్​ యశ్​ధుల్​ రంజీల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అరంగేట్రం మ్యాచ్​లోనే రెండు ఇన్నింగ్స్​లో రెండు సెంచరీలు బాది రికార్డులో నిలిచాడు. తమిళనాడుతో మ్యాచ్​లో 200 బంతుల్లో 100 పరుగులు చేశాడు. మరోవైపు ఈ మధ్యకాలంలో బ్యాటింగ్​లో తడబడుతున్న పుజారా మళ్లీ పుంజుకున్నాడు. ముంబయితో మ్యాచ్​లో 83 బంతుల్లో 91 పరుగులు చేశాడు.

  • సినిమాల్లోకి యడియూరప్ప..

Yeddyurappa Movies: కర్ణాటక మాజీ సీఎం బీఎస్​ యడియూరప్ప మరోసారి సీఎం కానున్నారు. అయితే రియల్​ లైఫ్​లో కాదు.. రీల్​ లైఫ్​లో. అవును. యడియూరప్ప సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఓ వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. ఆ సినిమా కథేంటంటే..?

  • సితార 'కళావతి' ఛాలెంజ్..

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'కళావతి' పాటకు మహేశ్​ కుమార్తె సితార డ్యాన్స్​, కీర్తి సురేశ్ మ్యూజిక్​ వీడియో, సెబాస్టియన్ రిలీజ్ వాయిదాకు సంబంధించిన సంగతులు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details