తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA

By

Published : Feb 19, 2022, 5:00 PM IST

  • వనదేవతలను సందర్శించుకున్న గవర్నర్​..

Governor Tamilisai Visits Medaram: మేడారం మహాజాతరను గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ సందర్శించారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద గవర్నర్‌ తమిళిసై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నానని గవర్నర్​ తెలిపారు.

  • రీజినల్ రింగ్‌రోడ్డు రాకతో కీలక మార్పు..

Kishan Reddy on National Highways: తెలంగాణ అభివృద్ధి ముఖచిత్రంలో కీలక మార్పు రీజినల్ రింగ్‌రోడ్డు ద్వారా జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం జాతీయ రహదారుల కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆయన వెల్లడించారు.

  • ఉద్యోగాల్లో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు..

Presidential Orders: 2018 నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగ నియామకాల్లో జూనియర్ అసిస్టెంట్ మొదలు డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు లభించనున్నాయి.

  • లైంగిక దాడిని ప్రతిఘటించిన యువతికి నిప్పు..

ప్రేమించానన్నాడు. ఎన్నో మాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటా నాతో వచ్చేయమన్నాడు. నమ్మి ఇంటి నుంచి వచ్చేశాక.. ఆ మాటే దాటేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తే.. వదిలించుకోవాలనుకున్నాడు. వదిలించుకునే ముందు తీసుకొచ్చిన పని ముగించుకోవాలనుకున్నాడు. ఓ రాత్రి పూట తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాడిని ప్రతిఘటించిందని.. దివ్యాంగురాలని కూడా చూడకుండా యువతికి నిప్పంటించాడు.

  • సద్దుమణగని 'హిజాబ్' వివాదం..

Hijab controversy: విద్యాసంస్థల్లో యూనిఫాం నిబంధన తప్పనిసరిగా పాటించాల్సిందేనని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. కర్ణాటకలో హిజాబ్​ వివాదం కొనసాగుతూనే ఉంది. బెళగావిలోని విజయ పారా వైద్య కళాశాలకు సెలవులు ప్రకటించారు. శివమొగ్గ జిల్లాలోని ఓ కళాశాలలో 58 మంది విద్యార్థులను సస్పెండ్​ చేసింది యాజమాన్యం.

  • విధి నిర్వహణలోనే ఓటేసిన డ్రైవర్​..

TN Local body election 2022: తమిళనాడులో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ విధి నిర్వహణలో ఉంటూనే ఓటువేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

  • కరోనా ఇంకా ముగియలేదు..

Next Covid Variant: వేగంగా ప్రబలే మరింత ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుకురావడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది. అయితే కలిసికట్టుగా దీన్ని అంతం చేయవచ్చని పేర్కొన్నారు.

  • పరస్పరం ఢీకొన్న వందలాది కార్లు..

Car Collision Snow: భారీ హిమపాతం ధాటికి కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి. దీంతో.. వందలాది కార్లు, ట్రక్కులు పరస్పరం ఢీకొన్నాయి. అమెరికాలోని ఇల్లినాయిస్​ రాష్ట్రంలో విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. దారి కనిపించకపోవడం వల్ల పలు వాహనాలు అదుపుతప్పాయి. వాటిని వెలికి తీసేందుకు సహాయసిబ్బంది తీవ్రంగా శ్రమించారు.

  • భారత్‌లో అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ సెషన్..

IOC Session 2023: అంతర్జాతీయ ఒలింపిక్స్​ కమిటీ 2023 సెషన్​ నిర్వహించేందుకు భారత్​ హక్కులు దక్కించుకుంది. చివరగా 1983లో దిల్లీలో ఓ ఐఓసీ సెషన్​ జరిగింది.

  • 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్​కు గెస్ట్​గా కేటీఆర్..

Bheemla nayak pre release event: పవన్ 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్​కు గెస్ట్ ఎవరో ఖరారైపోయారు. తెలంగాణ మంత్రి కేటీఆర్.. ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు చిత్రబృందం తెలిపింది. ట్రైలర్​ను ఈ సోమవారం విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details