తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA

By

Published : Feb 17, 2022, 4:58 PM IST

  • జనమయమైన జంపన్న వాగు..

Medaram Jathara 2202: మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునే క్రమంలో భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ క్రమంలో ఇసకేస్తే రాలనంతగా జంపన్న వాగు భక్తులతో కిక్కిరిసిపోయింది.

  • కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు..

Harish Rao Praises Kcr: కేసీఆర్​ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని మంత్రి హరీశ్​రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలో రంగనాయకసాగర్​ ఎడమకాలువకు మంత్రి నీటిని విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా కేక్​ కట్​చేసి పంచిపెట్టారు.

  • భూముల విక్రయానికి హైకోర్టు పచ్చజెండా..

Telangana Govt Lands: రాష్ట్రంలో ప్రభుత్వ భూముల విక్రయానికి హైకోర్టు పచ్చజెండా ఊపింది. కోకాపేట్‌, ఖానామెట్‌ భూముల వేలంపై భాజపా నేత విజయశాంతి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణను ముగించింది. ప్రభుత్వం తమ భూములను విక్రయించడాన్ని తప్పుబట్టలేమని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

  • అమ్మ వారి కోసం 'డాలర్ టెంపుల్'..

Dollar Temple in Gujarat: 'డాలర్ టెంపుల్​'.. వినడానికి కొత్తగా ఉంది కదా! గుజరాత్​లో వరదాయిని మాతా దేవాలయం ఈ ఏడాది ఉత్సవాల సందర్భంగా ఇలా దర్శనమిచ్చింది. మరి.. డాలర్ టెంపుల్​ను ఓసారి చూసొద్దాం పదండి..!

  • పిల్లలు, మహిళల చేతులు కట్టేసి..

Police Beating Women: ఇసుక తవ్వకాలపై పోలీసులకు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ జరిగింది. గ్రామస్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. పిల్లలు, మహిళలను కూడా చేతులు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. అటు.. తమపై గ్రామస్థులు రాళ్లతో దాడి చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. గ్రామస్థుల వెనక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని తెలిపారు. 10 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

  • స్కూల్​ బస్సులకు ప్రమాదం..

School Bus Accident: రాజస్థాన్​లోని జైసల్మేర్​లో దారుణం జరిగింది. ఓ స్కూల్​ బస్​ బోల్తా పడి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. మరో 40 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. యూపీలో జరిగిన మరో ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

  • జియోకు భారీ షాక్​...

Jio subscribers in india: రిలయన్స్​ జియోకు చందాదారులు షాక్​ ఇచ్చారు. సుమారు 1.29 కోట్ల మంది జియోను వీడారు. మరో వైపు అనూహ్య రీతిలో ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్​ఎన్​ఎల్​ తన చందాదారులను భారీ స్థాయిలో పెంచుకుంది. ఈ మేరకు ట్రాయ్​ డిసెంబర్​ నెల గణాంకాలను విడుదల చేసింది.

  • మార్కెట్లకు మళ్లీ నష్టాలు...

Stock Market Close: రష్యా- ఉక్రెయిన్​ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. స్టాక్​ మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 105, నిఫ్టీ 18 పాయింట్ల మేర పడిపోయాయి.

  • యూవీ ప్రపంచ రికార్డు జస్ట్​ మిస్​..

Sunil Narine BPL: బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో బుధవారం రాత్రి జరిగిన ఓ మ్యాచ్​లో విండీస్​ ఆటగాడు సునీల్​ నరైన్​ విధ్వంసకర ఇన్నింగ్స్​ ఆడాడు. 13 బంతుల్లో అర్ధ శతకం బాది టీ20 క్రికెట్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కానీ టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్​ సింగ్​ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మాత్రం మిస్ చేశాడు.

  • మోహన్​బాబు సంచలన కామెంట్లు..

Mohan babu son of india: తనపై ట్రోల్స్ చూసినప్పుడు బాధగా అనిపిస్తుందని సీనియర్ నటుడు మోహన్​బాబు అన్నారు. ఇద్దరు హీరోలే ఈ పనంతా చేయిస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details