ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..కేసీఆర్ రాజకీయాలను వీడి ఉంటే.. KTR At Kandlakoya IT Park: హైదరాబాద్ కండ్లకోయలో ఐటీ పార్కుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పది ఎకరాల్లో 40 మీటర్ల ఎత్తు, 14 అంతస్తులతో ఐటీ పార్కును నిర్మిస్తున్నారు. ఐటీ పార్క్‌తో కండ్లకోయ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.కేసీఆర్ పుట్టిన రోజుకు నాగ్ గిఫ్ట్..Hero Nagarjuna: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. వెయ్యి ఎకరాల అడవిని హీరో నాగార్జున దత్తత తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో 'అక్కినేని నాగేశ్వరావు అర్బన్ ఫారెస్ట్ పార్క్' ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.ఓయూలో విద్యార్థి సంఘాల ఘర్షణ.. Student Unions Fight in OU: ఉస్మానియా వర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ బీఎస్‌ఎఫ్ కార్యకర్తల ధర్నా చేశారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయగా.. వారిపై టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.రైతులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది..Election 2022: రైతులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ భక్తి నుంచి స్ఫూర్తి పొందిన ప్రభుత్వం పంజాబ్‌కు ఇప్పుడు అవసరమని అన్నారు.మీ తప్పులకు నెహ్రూను బాధ్యుల్ని చేస్తారా? Manmohan Singh criticizes Modi: పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. భాజపా లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. భాజపా తన తప్పులను అంగీకరించకుండా ప్రజా సమస్యలకు నెహ్రూనే బాధ్యులను చేస్తోందని ధ్వజమెత్తారు. అన్ని విషయాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.రూ.14 ఖర్చుతో 100 కిలోమీటర్లు ప్రయాణం..ఆ రైతు చదివింది పదో తరగతి.. నైపుణ్యం మాత్రం ఇంజినీర్‌కు ఉన్నంత ఉంది. కేవలం రూ.14 ఖర్చుతో 100 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చంటే ఈ రోజుల్లో ఎంత చౌకో అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్ ధరలు ఆకాశన్నంటుతున్న తరుణంలో రెండు సంవత్సరాలు కష్టపడి విద్యుత్ బైకును తయారుచేశాడు ఈ రైతు.వరదలతో బ్రెజిల్ అతలాకుతలం... Brazil mudslides: బ్రెజిల్ రాష్ట్రంలోని రియో డి జెనీరోలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 94 మంది మరణించారని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మరిన్ని మృతదేహాలు కొండచరియల కింద కూరుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. భారీగా కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.భారీగా పెరిగిన బంగారం ధర..Gold Price Today: దేశంలో పది గ్రాముల మేలిమి బంగారం ధర క్రితం రోజుతో పోల్చితే సుమారు రూ. 442 పెరిగింది. కిలో వెండి ధర రూ. 65,168 వద్ద ఉంది. ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర ఇలా ఉంది.మహీ విశ్వాసాన్ని రైనా కోల్పోయాడు.. IPL Suresh raina Dhoni: సురేశ్‌రైనా.. సీఎస్కే కెప్టెన్ ధోనీ నమ్మకాన్ని కోల్పోయాడని అభిప్రాయపడ్డాడు న్యూజిలాండ్ క్రికెటర్ సైమన్ డౌల్. అందువల్లే చెన్నైతో సహా ఇతర ఫ్రాంఛైజీలు అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదని అన్నాడు. ఫిట్‌నెస్ లేడనే కారణంతో రైనాను సీఎస్కే ఈ సారి వదిలేసిందని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ఇటీవల వెల్లడించాడు.అందాల తారల కొత్త ఫొటోషూట్లు..నటి, యాంకర్ అనసూయ సహా పలువురు ముద్దుగుమ్మలు తమ కొత్త ఫొటోషూట్‌తో సందడి చేశారు. హీటెక్కించే అందాలతో హాట్‌హాట్ ఫోజులతో ఫ్యాన్సుకు కనువిందు చేస్తున్నారు. మరి మీరు వాటిని చూసేయండి...