ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..అక్కడ భూములు అమ్ముకోవద్దు.. Harish Rao Narayankhed Tour : బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా ఆయకట్టు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈనెల 21న సంగారెడ్డి జిల్లాలో నిర్మిస్తున్న బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.అసోం సీఎం కంటే సంస్కార హీనుడు రేవంత్..Minister Jagadish reddy: సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు సంస్కారయుతంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అన్నారని మంత్రి గుర్తు చేశారు.ఆర్టీసీ ప్రత్యేక సేవలు అదరహో.. Medaram Jatara 2022: వనదేవతల చెంతకు భక్తులను చేర్చడానికి ఆర్టీసి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా 4 వేల బస్సులను నడిపిస్తోంది. ఆర్టీసీ బస్సులో వచ్చిన భక్తులను గద్దెల సమీపానికి చేర్చుతున్నారు. సాంకేతిక సోబగులు అద్దుకున్న ఆర్టీసీ.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమైంది.ఒవైసీపై దాడి నిందితులకు మంత్రి అండ..Attack on Owaisi UP minister: అసదుద్దీన్ ఒవైసీ కారుపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి కుటుంబ సభ్యులను యూపీ మంత్రి సునీల్ భరద్వాజ్ పరామర్శించారు. నిందితులు అమాయకులంటూ వెనకేసుకొచ్చారు.కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ ఉక్రెయిన్'.. Indian Embassy In Ukraine: రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య విమాన సేవలను మరింత పెంచేందుకు పౌర విమానయాన శాఖ, వివిధ ఎయిర్‌లైన్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించాయి.ఒక్కటవనున్న యంగ్ మేయర్.. యువ ఎమ్మెల్యే..Youngest Mayor Arya Rajendran marriage: ఒకరేమో అతిపిన్న వయసులో మేయర్ పీఠం ఎక్కిన వ్యక్తి... మరొకరు రాష్ట్ర అసెంబ్లీలో అతి తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యే.. ఈ ఇద్దరు యువ రాజకీయ నేతలు ఒక్కటి కాబోతున్నారు. వివాహ బంధంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు.24 మంది భాజపా నేతలకు 'వీఐపీ భద్రత'.. VIP Security For BJP Leaders: అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్‌లోని దాదాపు 24 మంది భాజపా నేతలకు 'వీఐపీ కేటగిరీ' భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. వీరితో పాటు కేంద్ర మంత్రి ఎస్పీఎస్ బఘేల్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించినట్లు అధికారులు తెలిపారు.మార్కెట్లో తీవ్ర ఒడుదొడుకులు..Stock Market Close: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం.. తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆరంభంలో బాగానే ఉన్నా.. ఆఖరి గంటలో అమ్మకాలతో నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 145, నిఫ్టీ 30 పాయింట్లు పడిపోయాయి.వేలంలో రూ.10 కోట్లు.. ఫ్రెండ్స్‌కు పిజ్జా పార్టీ.. IPL Nicholas Pooran: ఐపీఎల్లో భారీ ధరకు అమ్ముడుపోయిన విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ తెగ సంబరపడిపోతున్నాడు. వేలం జరిగిన మరుసటి రోజు సహచరులకు పిజ్జా పార్టీ ఇచ్చాడు. ప్రస్తుతం బయోబబుల్ ఉన్నప్పటికీ రూ.15 వేలు ఖర్చు చేసి మరీ.. క్వాలిఫైడ్ చెఫ్‌తో వీటిని తయారు చేయించాడు.కొత్త సినిమా ముచ్చట్లు వచ్చేశాయి..సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'కళావతి' సాంగ్, నాని 'దసరా', సూర్య 'ఈటీ' చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.