ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..వైభవంగా సమతామూర్తి స్వర్ణ విగ్రహావిష్కరణ.. President Ramnath Unveiled Gold statue of Ramanuja: శ్రీరామ నగరంలోని సమతామూర్తి కేంద్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రామానుజాచార్యుల 120 ఏళ్ల జీవితానికి గుర్తుగా 120 కిలోల స్వర్ణమూర్తి ప్రతిమను.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించి లోకార్పణం చేశారు. వేద మంత్రోచ్చారణ మధ్య అంగరంగ వైభవంగా కార్యక్రమం సాగింది. రేపు వేద పండితులు.. శాస్త్రోక్తంగా స్వర్ణమూర్తికి ప్రాణప్రతిష్ఠాపన చేయనున్నారు.మేడారం జాతరకు కేంద్రం నిధులు..Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం ఏర్పాట్ల కోసం 2.5 కోట్లు నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం.. గిరిజన ప్రజల విశిష్ట సంస్కృతి, వారసత్వాన్ని గౌరవిస్తుందని కిషన్‌రెడ్డి చెప్పారు.రాజకీయాల్లో హుందాతనం లేదు.. Mp Arvind on Jangareddy: గత పదేళ్లుగా రాజకీయాల్లో హుందాతనం కనిపించడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. వరంగల్‌లో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో కలిసి మాజీ ఎంపీ జంగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.అసోం సీఎం వ్యాఖ్యలపై రేవంత్ ఫైర్..Revanth Reddy Fires on Assam cm : అసోం సీఎం హిమంత బిశ్వశర్మను వెంటనే బర్తరఫ్ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపైన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించకపోవడం దారుణమన్నారు. ఆ వాఖ్యలను నిరసిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని అన్నారు.ఎన్నికలకు దేవభూమి సిద్ధం.. Uttarakhand Election 2022: ఉత్తరాఖండ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 70 స్థానాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. కొవిడ్-19 దృష్ట్యా ఎన్నికల సంఘం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది.నల్లగా మారిన గంగాజలాలు...Ganga waters turn black: కాశీ ఘాట్ల వద్ద గంగానది నీరు నలుపు రంగులోకి మారిపోయింది. మురుగు నీరు, ఫ్యాక్టరీల వ్యర్థాలతో నదీజలాలు కలుషితమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు. నీటి నమూనాలు సేకరించి పరిశీలనకు పంపించారు.ఏడు అడుగులు ఎత్తైన వంగ తోట.. 7 feet brinjal plant: సాధారణంగా వంకాయ మొక్క రెండు నుంచి నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. కానీ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువకుడు మాత్రం.. ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఏడు అడుగుల ఎత్తైన వంకాయ మొక్కను పండించాడు.చీర కోసం కుమారుడ్ని 9వ అంతస్తు నుంచి వేలాడదీసి..Mother risks son for sari: ఈదురు గాలులకు బాల్కనీలో ఆరేసిన ఓ చీర.. కింది అంతస్తులో పడిపోయింది. అయితే, ఆ చీరను తీసుకొచ్చేందుకు ఓ తల్లి తన కొడుకుతో భవనం తొమ్మిదో అంతస్తు ఎత్తులో సాహసం చేయించింది. బెడ్‌షీట్ సాయంతో బాలుడిని కింది అంతస్తుకు పంపింది.కుర్ర ఆటగాళ్లకు మాంచి డిమాండ్.. IPL 2022 Mega auction: రెండో రోజు మధ్యాహ్నం తర్వాత జరిగిన వేలంలో.. ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా పంట పండింది. వీరి కోసం వరుసగా రూ. 5.25 కోట్లు, రూ. 4.20 కోట్లు వెచ్చించింది దిల్లీ క్యాపిటల్స్. అండర్-19 వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన భారత ఆల్‌రౌండర్ రాజ్ బవా రూ. 2 కోట్లకు అమ్ముడయ్యాడు. కెప్టెన్ యశ్ ధుల్‌కు రూ. 50 లక్షలే దక్కాయి.కొత్త సినిమా ముచ్చట్లు..Sarkaru vaari pata song released: కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఇందులో 'మహేశ్ సర్కారు వారి పాట', రామ్‌చరణ్-శంకర్ కాంబో సినిమా వివరాలు ఉన్నాయి.