తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA

By

Published : Feb 13, 2022, 2:58 PM IST

  • హైదరాబాద్​కు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​..

President Ramnath Kovind Muchintal Visit: రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ హైదరాబాద్​ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట​ విమానాశ్రయనానికి చేరుకున్న రాష్ట్రపతికి.. గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్​ స్వాగతం పలికారు. కాసేపట్లో ఆయన ముచ్చింతల్​లోని సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు.

  • కేసీఆర్​ యుద్ధం చేస్తానంటే మేం సిద్ధమే..

Kishan Reddy Comments on CM KCR: ఈ నెల 15, 16 తేదీల్లో... హైదరాబాద్‌ వేదికగా సాలార్​జంగ్‌ మ్యూజియంలో అంతర్జాతీయ మ్యూజియం సదస్సును నిర్వహిస్తామని.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న గిరిజన మ్యూజియానికి ఇప్పటికే కోటి రూపాయలు నిధులు మంజూరు చేసినా... రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపించలేదని కేంద్ర మంత్రి ఆరోపించారు. పార్టీ పరంగా భాజపా ఎవరి దయాదాక్షిణ్యాలపై మీద పని చేయడం లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

  • రైతుల భగీరథ స్ఫూర్తితో నీటి కష్టాలకు చెక్​​...

Veldurthy Farmers Innovative thinking: వందల అడుగుల లోతు బోర్లు వేసినా చుక్క నీరు పడకపోవడంతో వినూత్నంగా ఆలోచించారు ఆ రైతులు. తమకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగు నీటిని ఒడిసిపడుతున్నారు. నీటిని తమ గ్రామాలకు మళ్లించుకోవడం కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.

  • కర్ణాటకలో తెరుచుకోనున్న స్కూల్స్​​..

Hijab row: హిజాబ్ వివాదం కారణంగా కర్ణాటకలో మూతబడిన పాఠశాలలు ఫిబ్రవరి 14న తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే స్కూల్స్​ వద్ద సోమవారం నుంచి సెక్షన్​ 144 విధిస్తున్నట్లు ఉడుపి జిల్లా యంత్రాంగం పేర్కొంది. మరోవైపు పాఠశాలల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయనే నమ్మకం ఉందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.

  • కిలోలెక్కన బస్సులు అమ్మేసిన యజమాని..

Covid Restrictions: బస్సులను కిలో రూ.45 చొప్పున తుక్కు కింద విక్రయించారు కేరళలోని ఓ పర్యటక బస్సుల యజమాని. కరోనా ఆంక్షల కారణంగా తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడినట్లు చెప్పారాయన. ఇదే పరిస్థితి ఇతర బస్సు యజమానులు కూడా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

60 కోట్లు విలువ చేసే డ్రగ్స్​ స్వాధీనం..

ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు రూ. 60 కోట్లు విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్​ అధికారులు. వాటిని వివిధ బ్యాగుల్లో కనిపించకుండా పెట్టి తీసుకొస్తున్నట్లు గుర్తించారు.

  • ఎకనామిక్స్​లో మాస్టర్​ ఈ సీరియల్​ కిల్లర్​..

Serial killer Rajendran arrest: తమిళనాడు నాగర్​కోయల్​కు చెందిన ఓ సీరియల్​ కిల్లర్​ను కేరళ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితునికి ఇప్పటివరకు ఐదు హత్య కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు అధికారులు చెప్పారు.

  • ఐదుగురు ఐక్యరాజ్య సమితి ఉద్యోగుల కిడ్నాప్​..

UN Yemen news: యెమెన్​లో ఐదుగురు ఐక్యరాజ్య సమితి ఉద్యోగులు కిడ్నాప్​కు గురయ్యారు. వారిని అల్​ఖైదా ఉగ్రవాదులు అపహరించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని నిర్ధరించిన యూఎన్​.. దీనిపై స్పందించేందుకు మాత్రం నిరాకరించింది.

  • గతేడాది రూ. 9 కోట్లు.. ఇప్పుడు 90 లక్షలు..

IPL Auction Updates: ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవుతాయి అంటారు తెలుసా? అచ్చం ఈ ప్లేయర్​కు అదే వర్తిస్తుంది. ఐపీఎల్​ 2022 వేలంలో ఇదే జరిగింది. గతేడాది మినీవేలంలో అతడిని చెన్నై సూపర్​ కింగ్స్​ రూ. 9.25 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఇప్పుడదే ప్లేయర్​.. రూ. 90 లక్షలకే కోల్​కతా సొంతమయ్యాడు. ఇంతకీ ఎవరా ప్లేయర్?

  • విష్ణు 'నో' అంటే సినిమా చేసేవాడిని కాదు..

Son of india pre release event: నటుడు, నిర్మాత మోహన్​బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సన్ ఆఫ్ ఇండియా'.. పవర్​ఫుల్​ కథతో తీశామని చెప్పారు. ఫిబ్రవరి 18న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ABOUT THE AUTHOR

...view details