ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..తెలంగాణ పురోగమిస్తోంది.. CM KCR Yadadri Tour Speech: యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. భువనగిరి సులువుగా అభివృద్ధి చెందే ప్రాంతమని స్పష్టం చేశారు. హైదరాబాద్, వరంగల్ అద్భుతమైన కారిడార్‌గా అభివృద్ధి చెందుతాయని అన్నారు.సీఎం కేసీఆర్ కారణజన్ముడు..MLA Roja Yadadri Visit: ఏపీ ఎమ్మెల్యే రోజా యాదాద్రిని సందర్శించారు. భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న రోజా.. నూతనంగా నిర్మితమవుతున్న ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ కట్టడాలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవట్లేదని.. స్వామివారే సీఎం కేసీఆర్ చేత గొప్పగా గుడి కట్టించుకుంటున్నారని ప్రశంసించారు.చరిత్రను కనుమరుగు చేయాలని.. Round Table Meeting: రాజ్యాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పలువురు నేతలు ఖండించారు. కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు అణగారిన ప్రజల హక్కుల మీద దాడి చేయడమేనని తెజస అధినేత కోదండంరాం మండిపడ్డారు. చరిత్రను కనుమరుగు చేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని విద్యా సంస్థల్లో ఒకే డ్రెస్‌కోడ్..Common dress code Supreme Court: విద్యా సంస్థల్లో డ్రెస్‌కోడ్ నిబంధన అమలయ్యేలా చూడాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. డ్రెస్‌కోడ్ వల్ల విద్యార్థుల్లో సమానత్వం, సోదరభావం పెంపొందించినట్లు అవుతుందని పేర్కొంది. మరోవైపు, కళాశాలలకు సెలవులు పొడగిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.గంగా తీరంలో వలస పక్షులు.. Siberian Birds In Up Prayagraj: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గంగా తీరాన సైబీరియా వలస పక్షులు సందడి చేస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్ చుట్టుపక్కల ప్రాంతాలు, సంగం తీరానికి వలస పక్షులు భారీగా తరలివచ్చాయి. పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతమంతా ఆకర్షణీయంగా మారింది. వీటిని చూసేందుకు పర్యటకులు భారీగా తరలివస్తున్నారు.ఏ కౌగిలింతలో ఏం అర్థముందో..బాధైనా, సంతోషమైనా బిగి కౌగిలింతతో ఎదుటి వారితో పంచుకోవడం మనకు అలవాటే! తద్వారా మనసులోని భావోద్వేగాలు అదుపులోకొస్తాయని చెబుతున్నారు నిపుణులు. నిజంగానే కౌగిలింతకు అంత పవర్ ఉంది మరి! మనిషి మూడ్‌ని మార్చేసే శక్తి హగ్‌లో ఉందని ఇప్పటికే పరిశోధకులు శాస్త్రీయంగా నిరూపించారు కూడా!ఆండ్రాయిడ్ 13 వచ్చేస్తోంది.. Android 13 Preview: ఆండ్రాయిడ్ 13కు సంబంధించిన డెవలపర్ ప్రివ్యూని తాజాగా విడుదల చేసింది ఆ సంస్థ. ఆండ్రాయిడ్ 12లో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లకు ప్రాధాన్యమిచ్చిన గూగుల్, ఆండ్రాయిడ్ 13లో ప్రైవసీ, సెక్యూరిటీని మెరుగుపరిచేలా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ 13లో గూగుల్ ఎలాంటి ఫీచర్ల ఇవ్వనుందనే దానిపై ఓ లుక్కేద్దాం..స్టేజిపైనే కుప్పకూలిన ఆక్షనీర్..IPL 2022 Mega auction: ఐపీఎల్ మెగావేలంలో కాసేపు విరామం ప్రకటించారు. వేలం పాడే వ్యక్తి (ఆక్షనీర్) హ్యూజ్ ఎడ్మీడ్స్ ఒక్కసారిగా స్టేజీపైనే కుప్పకూలడం వల్ల బ్రేక్ తీసుకున్నారు. అతడిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు.హర్షల్ పటేల్ రికార్డు.. రైనాకు షాక్.. IPL 2022 Mega Auction Harshal Patel: ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ మెగావేలం రెండో సెట్లో హర్షల్ పటేల్ రికార్డు సృష్టించాడు. అతడిని రూ.10.75కోట్లు వెచ్చించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. కాగా, సురేశ్ రైనా సహా పలువురు కీలక ఆటగాళ్లపై తొలి రౌండ్లో ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.కొత్త సినిమాల అప్డేట్లు..Ravi Teja Ravanasura Movie: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. ఇందులో రవితేజ హీరోగా నటిస్తున్న 'రావణాసుర' చిత్రంతో పాటు సుధీర్ బాబు కొత్త సినిమా సంగతులున్నాయి.