ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..యాదాద్రి జిల్లాలో సీఎం పర్యటన.. CM Kcr Launched Presidential Suites: యాదాద్రి నారసింహుడి చెంత అత్యంత అధునాతన హంగులతో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్స్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు. వీటితో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొనున్నారు.కంటోన్మెెంట్ అభివృద్ధికి కేంద్రం అడ్డు..KTR Comments about Cantonment Development: పేదలకు పట్టాలు ఇద్దామంటే స్థలం ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల ప్రయోజనాలకు అడ్డుపడటం సరైంది కాదని హితవు పలికారు. సికింద్రాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.జీవో 317ను సవరించాలని మహా ధర్నా.. Teachers protests at dharna chowk: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన నిరసనతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. 317జీవోను సవరించాలని కోరుతూ చేపట్టిన మహాధర్నాలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు.తృణమూల్‌లో గరంగరం..రోజురోజుకీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. సీనియర్, జూనియర్ నాయకుల మధ్య విబేధాలు పెరుగుతున్నాయి. 'ఒకే వ్యక్తి ఒకే పదవి' విధానంపై పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వీటిన్నంటి గురించి మమత.. శనివారం సాయంత్రం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.ప్రాణాలకు తెగించి బాలికను కాపాడి.. రాజస్థాన్‌లోని భూపాల్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోబోతున్న బాలిక ప్రాణాలను కాపాడాడు. 17 ఏళ్ల అమ్మాయి చనిపోవాలని భోపాల్‌లోని బర్ఖేడీ గేట్ సమీపంలో ఉన్న ట్రాక్ వద్దకు వెళ్లింది. గూడ్సు రైలు వస్తున్నప్పుడు పట్టల మీద పడింది. దీనిని గమనించిన మెహబూబ్ అనే యువకుడు ఆమెను ట్రాక్ పై నుంచి జరిపి మధ్యలోకి తీసుకువచ్చాడు.రైలులో యువతిపై అత్యాచారం..Bhopal rape incident: సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. విశ్రాంతి తీసుకునేందుకు చోటు ఉందని తీసుకెళ్లిన ఓ కిరాతకుడు బాధితురాలు నిద్రించే సమయంలో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటనకు సంబందించి 15 మంది చిరు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కుమార్తె స్నానం చేస్తుండగా వీడియో తీసి.. Step Father records Daughter Bath Video : తనకు, తన బిడ్డకు తోడుగా ఉంటాడనుకున్న ఆ తల్లి నమ్మకాన్ని తుంచేశాడు. కూతురికి ప్రేమను, అప్యాయతను పంచాల్సినవాడే మృగంలా ప్రవర్తించాడు. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వాడే కామంతో సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు. వావి వరుస మరిచి కుమార్తె స్నానం చేస్తుండగా రహస్యంగా చిత్రీకరించాడు.ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?Gold Price Today: దేశంలో పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 51వేల పైకి చేరింది. కిలో వెండి ధర రూ. 65,820 వద్ద ఉంది. ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర ఇలా ఉంది..ఐపీఎల్ వేలంలో ఎవరెంత పలికారంటే.. IPL Auction 2022: ఐపీఎల్ మెగా వేలంలో టీమ్ఇండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది కోల్‌కతా నైట్‌రైడర్స్. అతడి కోసం రూ.12.25 కోట్లు చెల్లించనుంది. రబాడ, శిఖర్ ధావన్‌లను కూడా పెద్ద మొత్తాలకే కొనుగోలు చేశాయి ఆయా ఫ్రాంఛైజీలు.'డీజే టిల్లు' మోతమోగించాడా?DJ Tillu Review: ఇటీవల కాలంలో యూత్‌లో బాగా క్రేజ్ సంపాదించుకున్న సినిమా 'డీజే టిల్లు'. డైలాగులు, ప్రచార చిత్రాలతో సినిమాపై ఆసక్తిని కలిగించారు మేకర్స్. మరి శనివారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎంతమేర ఆకట్టుకుందో తెలుసుకోండి.