ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..జనగామలో సీఎం కేసీఆర్ పర్యటన.. cm kcr visits Jangaon: జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. యశ్వంతాపూర్ వద్ద నిర్మించిన జిల్లా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కేసీఆర్ రాకతో పట్టణమంతా గులాబీమయమైంది.కేసీఆర్ ఎందుకు బయటకు రాలేదు..Revanth Reddy Fired On Kcr: చట్ట సభల విలువలను కాలరాస్తూ తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ అవమానిస్తుంటే.. సీఎం కేసీఆర్ ఎందుకు బయటకు రావట్లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెరాస నాయకులు, కార్యకర్తలు మొక్కుబడిగా నల్ల జెండాల ప్రదర్శన చేశారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రేవంత్.. ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ అంటకాగారని విమర్శించారు.డిప్లమా సెమిస్టర్ పరీక్షా పేపర్ లీక్.. రంగారెడ్డిజిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో డిప్లమా సెమిస్టర్ ఎగ్జామ్ పేపర్ లీకైంది. అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని బాటసింగారంలోని స్వాతి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఇంజినీరింగ్ గణితం ప్రశ్నా పత్రాలు లీకైనట్లు ఆరోపణలు వచ్చాయి. వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం గుర్తించిన విద్యార్థులు ఫిర్యాదు చేశారు.ఇతర రాష్ట్రాలకూ హిజాబ్ వివాదం..Hijab row: కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకుతోంది. ముంబయిలోని ఓ కాలేజీ తాము హిజాబ్, బుర్ఖాను నిషేధిస్తున్నట్లు ప్రకటించడం దుమారానికి దారితీసింది. మధ్యప్రదేశ్‌లోనూ ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ప్రస్తుతం ఈ వివాదంపై విచారణ జరుపుతున్న కర్ణాటక హైకోర్టు విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వానికి సూచించింది. తరగతి గదుల్లో ఎలాంటి మతపరమైన వస్త్రాలు ధరించవద్దని స్పష్టం చేసింది.వివాదాస్పద తీర్పుల జడ్జి రాజీనామా.. Justice Pushpa Ganediwala: దుస్తులపైనుంచి తాకితే లైంగిక వేధింపులుగా భావించలేమంటూ వివాదాస్పద తీర్పు వెలువరించిన బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా రాజీనామా చేశారు. అదనపు జడ్జిగా పదవీకాలం ముగిసే ఒక్క రోజు ముందే రాజీనామా చేయటం గమనార్హం.క్రికెట్ బాల్ కోసం ఊరంతా లొల్లి..Fight for cricket ball: క్రికెట్ బాల్ కోసం ఓ గ్రామంలోని రెండు వర్గాల ప్రజలు పరస్పరం దాడి చేసుకున్నారు. కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.ఎయిర్టెల్ సేవలకు బ్రేక్.. Airtel Outage: భారతీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ సేవలకు దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిర్టెల్ నెట్‌వర్క్ అంతరాయంపై ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు.ఎల్‌ఐసీ ఐపీఓ కోసం వెయిటింగా?LIC IPO Shares discount: మరికొన్ని రోజుల్లోనే ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూకు రానుంది. రిటైల్ విభాగంలో తన పాలసీదారుల కోసం ప్రత్యేకంగా షేర్లను జారీ చేయబోతోంది. ఇందుకోసం ఇష్యూ పరిమాణంలో 10 శాతం షేర్లను కేటాయించనుంది. వీటికి షేరు ధరలో 5-10 శాతం రాయితీ సైతం ఇవ్వనున్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. అయితే రాయితీలో షేర్లను దక్కించుకోవడం ఎలా?సిరిస్‌ను క్లీన్‌స్వీప్ చేసేనా.. India vs West Indies: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన టీమ్ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ గెలిచి రోహిత్ సేన సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది.రణ్‌బీర్‌తో నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది..Alia ranbir wedding: ప్రియుడు రణ్‌బీర్‌తో తనకు ఎప్పుడో పెళ్లి అయిపోయిందనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ ఆలియా భట్. దీనిపై నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు.